Thursday, October 17, 2024

 శివా!అడ్డు కన్నుల చూడ అర్ధనారీశ్వరము

నిలువు కంటికే తెలియు నీ నిజ తత్వము
నిలువు కన్ను విరియనీ నిజ తత్వం తెలియనీ
మహేశా . . . . . శరణు .

 శివా!పుట్టి పెరిగితి నేను పుడమి సాక్షిగా

తెలిసి కొలిచితి నిన్ను కర్మ సాక్షిగా
జీవన పయనం సాగుతోంది నీవె రక్షగా
మహేశా . . . . . శరణు .
Uploading: 886094 of 886094 bytes uploaded.


 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మతిమరుపు వాడినని మతిమరపును నాలో మరీ మరీ పెంచకు తండ్రి...
నా ఆత్మ విశ్వాసాన్ని అసలే సడలించకు...
తప్పటడుగు వేయించకు శంకరా...
తప్పులు అస్సలే చేయించకు తండ్రి ....
నీ పాదం విడవని భక్తిని ప్రసాదించు...
పాత్ర మార్చి కరుణించు నంది పక్కనే పడి ఉంటా...
మహాదేవా శంభో శరణు........
Uploading: 730862 of 730862 bytes uploaded.


Monday, October 14, 2024

 బాహ్యంలో నా నేను ఊరేగుతూ...

అంతరంలో నా నేను కు దూరమై...
ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు...
నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా..
మహాదేవా శంభో శరణు.
Uploading: 415470 of 415470 bytes uploaded.



 శివా!పొగడ్త తెగడ్తలు నీకు పట్టవాయె

పంచభూతములు నిన్ను పట్టలేవాయె
నిన్ను పట్టి కట్టగలది ఆ భక్తియొకటే
మహేశా . . . . . శరణు .


Sunday, October 13, 2024

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!

సకల ఘటనలను సులువుగా రచియించి,

అందులో తోసేవు మమ్ములను తోలుబొమ్మలను చేసి,

ఆ పాత్రదారులకు సూత్రదారములు కట్టి,

ముడి తీసే మెలికను మరిచానంటావు...

సూత్రదారి

చిత్ర విచిత్రాలు నీకే సాద్యం

జిత్తుల మారులను

చిత్తులుగా చేసి

చిత్తలు హరించేవు

చిదానందా

చిద్విలాస

చితి నివాస

ఈశా

ఇంత లీల నీకు తాగునా.

మహాదేవా శంభో శరణు.

Thursday, October 10, 2024

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

పరమేశ్వరి
అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి
శ్రీ భువనేశ్వరి
రాజ రాజేశ్వరి
అజ్ఞాన అంధ వినాశ కారిణి
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
మాత మము ఆదరింపు
ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...