Monday, November 18, 2024

శివోహం

శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో
పుట్టి గిట్టుటలోన  నేను మట్టినే కూడి
మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను
మహేశా . . ... . శరణు .

Sunday, November 17, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
పశు పక్షాదులు నీ సన్నిధి మెరియ...
పశుపతినాథుడవని  తెలిసి పరవసించేను...
ఓ పశువుగా నేను నీ పదము చేరనీ...
నన్ను కూడా నీ పశువుల కొట్టాంలో కట్టేసుకోరాదా పరమేశ్వరా.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరి!
నా మనస్సును హృదయం నందు స్తిరముగా నిలిపి సర్వేద్రియాలను నిగ్రహించు కొని ఏకాగ్రతతో నిన్ను కొలుచి నీ చెంతకు చేరినందుకేమో మరి...
నేత్రములయందు ఆనంద బాష్పాలురాలు తున్నవి...
శిరము వంచి, అంజలి ఘటిస్తూ, స్వరంతో మనవి ధ్యానమనే సుధా రసము పానము  కల్పించి పాదాలు కొలుచుకు అనుగ్రహించు తండ్రి.

మహాదేవ శంభో శరణు.

శివోహం

శివా నీ నామస్మరణతో నాకు నిదుర రాదు.
నీకు నాతో ఆడే సరదా తీరదు
శివా నీ దయ

శివా!సౌఖ్యములడగను నేనెపుడూ
పరసౌఖ్యము కోరను నిన్నెపుడూ
నీ పదముల నుంచుము నన్నెపుడూ
మహేశా . . . . . శరణు .


శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మేము సంసార సాగరమున మగ్నమైన వారము...
భార్యా, బిడ్డలనే బంధము తెంచుకోలేని వారము...
కానీ అనన్య భక్తితో నీయందే మనస్సును కలిగి ఉన్నవారము...
సర్వ ప్రాణులకు నీవు ఆత్మ స్వరూపమని నిన్నే ప్రార్ధించుచున్న...
మిమ్ము శరణు వేడుతున్న.

మహాదేవ శంభో శరణు.



శివ
ఏలిక నీవయ్య...
నా ఆలోచన కూడిక నీతొనయ్యా...
మాతో పలుక వేమయ్య...
మా ప్రార్ధన ఆలకిన్చవయ్యా...
మమ్మేలు కోవయ్య...
మా తప్పులన్నీ మన్నించి మా మీద కరుణ చూపవేమయ్యా.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ! 
నీవే గమ్యం
నీవే ఆశ
నీవే శ్వాస
కష్ఠాలలో ఆనందపరవశ్యంలో
ఉబికిన కన్నీటిధారలతో నీకు అభిషేకం చేస్తూ నన్ను సాగనీ
నేను వేసే ప్రతి అడుగు
నీవైపు సాగేలా ప్రతి చర్య 
నువ్వు మెచ్చేలా 
ప్రతి మాట నిన్ను తెలిపేలా 
ప్రతి దినమునిన్ను కొలిచేలా 
ప్రతి క్షణము నిన్ను తలచేలా అనుగ్రహించు తండ్రి.

మహాదేవ శంభో శరణు.

Saturday, November 16, 2024

శివోహం

శివా!లింగాన నిన్ను గుర్తెరిగి వున్నాను
గుర్తెరిగి నీ పూజ చేసుకున్నాను
పూజ పండనీ బ్రతుకు నిండనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...