Sunday, November 24, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఉక్కిరిబిక్కిరవుతున్న నా ప్రతీ శ్వాసలోనూ నువ్వే...
రెక్కలు తెగిన పక్షినై కదలక మెదలక విలవిలలాడుతూ
చిద్రమై రక్తమోడుతున్న ఈ గుండె చప్పుడులోనూ నువ్వే...
నా బ్రతుకు నా జీవితం నాకు నచ్చని బాటలో సాగుతున్నా నీవిచ్చిన ఈ జననం నాకిష్టమే....
దినదినం సమీపిస్తున్నకొద్దీ
నీవియ్యబోయే మరణమూ నాకిష్టమే...
ఇన్ని జరుగుతున్న ఎలాంటి చలనం లేకుండా పైనుండి చోద్యం చూస్తున్న నువ్వూ నాకిష్టమే.
కానీ ఒకటే ఒక కోరిక తండ్రి
అందరికీ దూరంగా.. సుదూరంగా..
స్వేచ్చా విహంగంలా.....
ఆకాశమే హద్దుగా..
నాకునేనుగా విహరించేలానైనా శక్తినివ్వు...
కాని పక్షంలో హాయిగా నీ ఒడినిచేరుకునేలానైనా నాకు వరమివ్వు.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరి ఉన్నాడు...
నాలోనే...
నాతోనే...
నావెంటనే...
నాయోగక్షేమాలు చూస్తూ...
నన్ను నిరంతరం కనిపెడుతూ...

జై శ్రీమన్నారాయణ.

Saturday, November 23, 2024

అమ్మ దయ

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం...
సృష్టిలోని ప్రతీ జీవికి అమ్మ ఉంది...

అమ్మ అంటే అమ్మ నే
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కట్టే, పాము, కర్రను పట్టుకొని, లోపము లేని, సమస్త సృష్టికి మూలాధారమైన కృష్ణ శరీరము గల భగవంతుడైన కాల భైరవుడిని నేను పూజిస్తాను.
కాశీకి అధిపతి, కాలానికి అధిపతి మరియు అన్ని లోకాలకు స్వరూపుడు....
ప్రాపంచిక సుఖములను మరియు ముక్తిని ప్రసాదించేవాడు, అందమైన మరియు మంగళకరమైన రూపంతో, తన భక్తుల పట్ల దయగలవాడు మరియు అన్ని లోకాలలో ఉన్న కాల భైరవుడిని నేను పూజిస్తాను.

ఓం కాలభైరవయా నమః.

Thursday, November 21, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా అంతరంగంలో
ఎగిసిపడుతున్న ఈ అగ్ని జ్వాలలు నీకు కనిపించకుండా ఉండునా తండ్రి...
ఉబికివస్తున్న నా కన్నీటిలో
ఈ మనసుపడే వేధనలు నీకు తెలియకుండా ఉండునా??...
నా గుండె భారాన్ని తెలుపడానికి
నీవు తప్ప నాకెవరున్నారని ఈలోకంలో?...
ఎన్ని వందలసార్లు నీకు విన్నవించానో...
ఎన్ని వేలసార్లు నిన్ను తలచానో..
నీకు తెలియకుండా ఉండునా??...
నా చావుపుట్టుకలో నీ పాత్ర ఇమిడి ఉంటే బ్రతుకుసముద్రంలో నన్నిలా ముంచేస్తున్నావెందుకు తండ్రి??.

మహాదేవ శంభో శరణు.

Tuesday, November 19, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నాకు ఏ యోగము తెలియదు...
జపము, పూజ తెలియవు...
అసలు నేను ఏ గుడికి కూడా వెళ్ళాను...
కానీ ఎల్లప్పుడూ నీ భక్తుడను... నేను అరిషడ్వర్గాలు భవబంధాలు, జన్మ, మృత్యువు మొదలైన వాటిలో చిక్కుకొని యున్నాను....
మహాప్రభో పాహి తండ్రి పాహి. నన్ను ఈ ఆపత్తుల నుండి కాపాడుము.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...