Monday, March 31, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

నాలోనే వున్న నేను కై నేనుగా అన్వేషిస్తూ...

నీ ఊపిరి నా శ్వాసగా

నీ పేరే నా తపనగా

నీ రూపే నేనుగా మారిపోయి

నీకై తపిస్తూ నీకై జపిస్తూ

నీ కోసం కలవరిస్తూ ఎరుకతో

అంతఃర్గత యుద్ధమొకటి చేస్తున్న.


మహాదేవ శంభో శరణు.

Sunday, March 30, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

క్షణమైనా మనసు పెట్టినీ పూజ చేతమంటే

కాలమెంత మొండి కదలనీక మెదలనీక బంధించి చుట్టేసి కట్టేస్తోంది...

విషయ లోలత ముంచేస్తోంది మదిలో చింత రేపుతుంది

నా మది చితి చల్లారేదెప్పుడో నేను నిను దరి చేరేదెప్పుడో.


శివ నీ దయ.

Saturday, March 29, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

వేలితో లెక్కించలేని బంధువులు నాకు ఎంతమంది మంది ఉన్నా...

నా వేలు పట్టుకుని చివరిదాకా నా వెంట ఉండే ఆత్మీయ నేస్తం నువ్వే.

ఏమివ్వగలను తండ్రి నీకు నీవిచ్చిన జ్ఞాన భిక్ష లో ఓ అక్షరము చివరకారి నా పిడికేడి బూడిద తప్ప.


మహాదేవా శంభో శరణు.

Friday, March 28, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


నేడో, రేపో, మాపో యావత్తు భూమండలంలో ఉన్న జీవకోటి పరమాత్ముని సన్నిధికి చేరాల్సినదే...

ముందు వెనుక అందరు వరుస కట్టాలి...

ఈ విషయంలో మాత్రం అందరికన్నా నేను నీ ముందు ఉండేలా దీవించు.


మహాదేవ శంభో శరణు.

Thursday, March 27, 2025

 శివా!నీలో నేను, నాలో నీవు

ఒకరిలో వొకరై వొనగూరి వున్నాము

ఇరువురన్న రీతి భాసించు చున్నాము

మహేశా . . . . . శరణు .

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

చావు పుట్టుక నడుమ చైతన్యమే నీవు...

కర్మ ఫలము నిచ్చు కాల రూపుడవు...

బ్రతుకు బాట లన్ని బాగుసేయుము తండ్రి .

ఆత్మబంధువైన యఖిలగురుడ నీవే శరణు నీదే రక్ష


మహాదేవ శంభో శరణు.

Wednesday, March 26, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

నేను నీకుమల్లే మంచే పంచాను... నాకు నీ లాగే విషమే తిరిగి వచ్చింది...

నికుమల్లే కంఠం లో దాచుకున్న.

నేను నువ్వు నువ్వే నేను కదా.


మహాదేవ శంభో శరణు.

 శివా! నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా చేస్తున్నావు నీకిది న్యాయమా? తండ్రి... అన్యమేరగనీ నాకు నా బాధలో న...