Tuesday, April 1, 2025

 శివా!విలాస మెరుగని వాసం నీది

కులాసాలు కూడిన ఖైదు నాది

చెఱ విడిపించు నీ పరమనిపించు.

మహేశా . . . . . శరణు .

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

ఏమి మాయజేస్తావో నువ్వు

మహామాయావి నన్ను పరవశింపజేస్తావు 

నీ వశం జేసుకుంటావు మరువనీయవు నిన్ను

మమేకం జేసుకుంటావు నీలో  

అందుకే మహాదేవుడైయ్యావు నీవు.


మహాదేవ శంభో శరణు. 

Monday, March 31, 2025

 శివా!మనసు విప్పి చెప్పలా నా మాట

మనసైన వాడివి నా మనసెరుగవా

ఓ కంట చూడు నా కన్ను విరిసేలా

మహేశా . . . . . శరణు .

 శివా!స్పురణ నను చేరి నిలిచిపోనీ

స్మరణ నను కూడి పదిలమవనీ

కరుణ నీ కనుల వృష్టిగా కురియనీ

మహేశా . . . . . శరణు .

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

నాలోనే వున్న నేను కై నేనుగా అన్వేషిస్తూ...

నీ ఊపిరి నా శ్వాసగా

నీ పేరే నా తపనగా

నీ రూపే నేనుగా మారిపోయి

నీకై తపిస్తూ నీకై జపిస్తూ

నీ కోసం కలవరిస్తూ ఎరుకతో

అంతఃర్గత యుద్ధమొకటి చేస్తున్న.


మహాదేవ శంభో శరణు.

Sunday, March 30, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

క్షణమైనా మనసు పెట్టినీ పూజ చేతమంటే

కాలమెంత మొండి కదలనీక మెదలనీక బంధించి చుట్టేసి కట్టేస్తోంది...

విషయ లోలత ముంచేస్తోంది మదిలో చింత రేపుతుంది

నా మది చితి చల్లారేదెప్పుడో నేను నిను దరి చేరేదెప్పుడో.


శివ నీ దయ.

Saturday, March 29, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

వేలితో లెక్కించలేని బంధువులు నాకు ఎంతమంది మంది ఉన్నా...

నా వేలు పట్టుకుని చివరిదాకా నా వెంట ఉండే ఆత్మీయ నేస్తం నువ్వే.

ఏమివ్వగలను తండ్రి నీకు నీవిచ్చిన జ్ఞాన భిక్ష లో ఓ అక్షరము చివరకారి నా పిడికేడి బూడిద తప్ప.


మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!కంటి చూపు కోర్కెల కట్టబెట్టేను లోచూపు కోర్కెల తుడిచిపెట్టేను లోచూపుతో నీ చూపు కలియనీ మహేశా . . . . . శరణు .