Saturday, April 5, 2025

 శివా!

నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి

నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా

చేస్తున్నావు నీకిది న్యాయమా? తండ్రి...

అన్యమేరగనీ నాకు నా బాధలో నిన్నుగాక వేరొకరిని నిందించగలనా హర.

అయినా నాది నిందకాదు ఆవేదన మాత్రమే తండ్రి.


శివ నీ దయ.                                          

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శ్రీరామ రామ అంటే పాపాలు తొలుగు నండి...

శ్రీరామ నామము భవ తారక మంత్ర మండి...

స్మరించిన తరించును జన్మ ధన్య మగునండి...

గౌరికి  శివుడుపదేశించిన  శ్రీరామ నామమండి...

మధురాతి  మధురము శ్రీరామ నామము...

సులభము సరళము దివ్యాతి దివ్యము


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ  వరాననే.


ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

Friday, April 4, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

అక్కకరకు రాని బంధాలు ఎన్ని ఉన్నా ఏమి లాభం..

ఆ నలుగురుంటే చాలు కదా పాడే మీద ఆనందంగా ఊరేగి నిన్ను చేరడానికి.

మరిచి పోయా నాకు జ్ఞాన నేత్రాలు లేవు నీలాగా నీవు ప్రత్యక్షం అయినా నేను చూడలేను కానీ నీవే పలకరించు.


మహాదేవ శంభో శరణు.

Thursday, April 3, 2025

 శివా! గుండె నిండా నీవున్నా

గుర్తు లెన్ని తెలుసున్నా

గతి నె‌రుగలేకున్నా మతి నీయవా

మహేశా. . . . .శరణు.

 శివా!తల్లి వొడిని తెలియ తలచి నీవు

అమ్మ వొడిని చేరి ఆదమరిచేవు

తెలియ యెవరికైనా యిది ముచ్చటే

మహేశా . . . . . శరణు .

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

నీ సేవయే జీవనపరమార్థమాయే

నీ నామమే గానమాయే

నీ ప్రణవనాదమే నా శ్వాసాయే

నీ దివ్య స్వరూపమే నాలో దివ్యతేజమై వెలుగొందే

నీ యందే పరవశమొందే

నీ లోనే లయమాయే

ఇంకేమి కోరను.

శివ నీ దయ. 

Wednesday, April 2, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

గుప్పెడంత గుండెల్లో....

విశ్వమంత నీ రూపు నింపుకున్న...

మంత్రాలు వల్లించ నే చదవలేదు...

పూజలు చేయనికి నే పూజారిని కాను...

మదిలోన నీ రూపు నింపుకున్నాను మనసారా నిన్నే కొలుస్తూ ఓం నమః శివాయ అనుకుంటు కాలం గడుపుతున్న.


శివ నీ దయ.

 శివా! నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా చేస్తున్నావు నీకిది న్యాయమా? తండ్రి... అన్యమేరగనీ నాకు నా బాధలో న...