Thursday, July 9, 2020

శివోహం

సమస్తమైన ఆత్మలూ తానై అయినవాడు..

సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు..

సమస్తమూ తానై అయినవాడు..

సమస్త జగత్తులను సృష్టించువాడు..

జడలు గల శిరస్సుతో శోభిల్లువాడునూ..

అతిమృదువైన లేడి చర్మమును ధరించువాడునూ..

జడలమధ్యభాగమున గల శిఖలయందు పింఛములను ధరించువాడునూ..

దేహమునందు అన్ని అవయవములతో పూర్ణత్వము కలవాడునూ..

సర్వమైన భావనలకూ తాను మాత్రమే మూలమై వెలుగొందువాడునూ....

అయినటువంటి ఉమామహేశ్వరునకు సహస్ర ప్రణామములు ఆచరించుచున్నాను.

                  శివా సర్వమూ నీ దయ .

No comments:

Post a Comment

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...