సిరుల కేమి కొదవ నీకు శ్రీలక్ష్మి ఉండగా
మట్టి పెంకున నీవు ఆరగించేవు
జగముల పోషించేడి ఒజ్జవు గాని
పెరుగు అన్నము తప్ప పట్ట బోవు
భోగ మూర్తిగ నిన్నె చెప్పు చుందురు గాని
కాలు మడుచుట కూడ మరచి నిలిచేవు
మర్మమేదో దాచిమమ్ము మాయజేసేవు
మొక్కు చుంటిని నన్ను ఎక్కు చేయి
No comments:
Post a Comment