జీవుని లో ఉన్నది ఆత్మ
దేవుని లో ఉన్నది పరమాత్మ
బ్రతికినంత కాలం ఈ లోకంలో
మరణించిన తర్వాత పరలోకంలో
మానవునిలో ఉండే ఆత్మ పరమాత్మ
ఆత్మ ఉంది కాబట్టి పరమాత్మ ఉన్నాడు
ఇహలోకం ఉంది కాబట్టి పరలోకం ఉంది
పుట్టింది ఉన్నప్పుడు పుట్టించే వాడు ఉన్నాడు
పుట్టించేవాన్ని పుట్టించేవాడు పుట్టాడు
తనకు తానుగా ఉన్నాడు
స్వయంభూగా పుట్టినవాడు మరణిస్తాడు
స్వయంభువుకు మరణం లేదు
పుట్టిన ప్రతివాడు ఒకప్పుడు మరణించిన వాడే
మరణించిన ప్రతివాడు మళ్లీ పుట్టబోయే వాడే
చావుపుట్టుకలు ఉన్నవాడు జీవుడు
చావు పుట్టుకలు లేనివాడు దేవుడు
మరణిస్తూ పుడుతూ ఉండే జీవునిలో
మరనించకుండ ఉండేది ఆత్మ
మరణించదు కాబట్టి ఆత్మ స్వయంభువు
పరమాత్మ స్వయంభువు కాబట్టి ఆత్మే పరమాత్మ
ఆత్మ కనిపించదు కాబట్టి పరమాత్మ కనిపించడు
దేహం ఉన్న జీవుడు కనిపిస్తాడు
దేహం లేని జీవుడు కనిపించలేడు
దేహం వీడిన ఆత్మ ఎక్కడ ఉంటుంది
దేహ రహిత ఆత్మ-పరమాత్మ లో లీనం అవుతుంది
మరి అయితే పరమాత్మ ఎక్కడ
ఈ అనంత విశ్వం అంతా పరమాత్మే
No comments:
Post a Comment