ఈశ్వారా,
నిన్ను పూజించిన సర్పము ఏ శాస్త్రమును అభ్యసింపలేదు
.నిన్ను భుజించిన ఏనుగు ఏ విద్యను నేర్వలేదు.
బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును నిన్ను అర్చించుటకై నేర్చుకొనలేదు
.నీ పూజ చేయుటకు సమస్త ప్రాణులకు
ఏ చదువులు అక్కరలేదు.
కేవలము నీ పాదములను అర్చించవలెనను కోరికయే అందుకు మూలకారణము.
రేయి పగలు మనసు , మాట , మేను
సదా నీ స్మరణంలో నీ ద్యానములో ఉండే బుద్దిని ప్రసాదించుము తండ్రీ పాహిమాం...రక్షమాం....
ఓం....
No comments:
Post a Comment