తండ్రి శిరముపై
గంగమ్మ ఉంటుందని
హిమవత్పర్వత స్థాణువులన్నీ
సాంబ సదా శివుని
స్థావరాలని నేనెరుగనా
మన బాధలన్నీ
అగ్ని పర్వతాలైతే
తన హృదయంలో
నిక్షిప్తం చేసుకున్న
శివప్ప హృదయమే
నాకు ఆదర్శం
సకల చరాచర
సృష్టి లోని
ప్రతి జీవి యొక్క
సంకల్పమూ నాదే
ఆ ప్రాణుల
మూగ వేదనలూ నావే
No comments:
Post a Comment