ఏ శ్వాస చివరిదో....
ఏ అడుగు తుది అ డుగో....
ఏ బంధం..... ఎటో మళ్లీస్తుందో.... ఏ క్షణం ఎలా శాసిస్తుందొ... ఈశ్వరా
నడిచే దారి లో మార్గ బంధువు అయి.... వెంట రా.... చూసే చూపు కు గమ్యమై నీవు ఉండి పో..!!
చేసే ప్రార్థన కు.... పలుకు లు. పరంపరగా ఉండిపో...!
వేడుకునే వేదనకు వేదమై తోడు రా...!!
చూసే నా చూపు కు లక్ష్య మై... శాస్విత చిత్రమై హృదయం లోకి చేరి పో....!!
వేడుకోలు అనుకో...
వేడుక అనుకో...!
వేదన అనుకో... నీ కోసమే చేసే వాదన అనుకో... ఎది ఏమైనా నాతో ఉండిపో...!
నిన్ను గా మార్చు కో.... మహా దేవ శరణు శరణు..!!
No comments:
Post a Comment