Monday, August 31, 2020

శివోహం

నిజాయితీగా లొంగిపోవడం అనేది...
జ్ఞానోదయానికి అసలు రహస్యం...
తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా...
తనను తాను శ్రీరామ చంద్రుడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయుడు...
నిజాయితీగా ఆ తన దైవానికి లొంగిపోయినప్పుడే మనలోని అహం నాశనమవుతుంది...

జై శ్రీరామ్. జై జై హనుమాన్

శివోహం

లోక కళ్యాణం కొరకు నీవు గరళాన్నే మింగావు...
నాపాప క్షయానికి ఈమాత్రం బాధలు పడలేనా ఏంటి...
నాబాధలను నీనామ ప్రవాహం అదుపు చేయదా ఏంటి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

లలిత లలిత 
చర్విత చరణాల
నీ పదముల వెంట
నేను నడుస్తూనే ఉంటా 

సంస్కృతి 
వైభవ సౌరభాలను
ప్రతి భక్తుని హృదయంలో
వెదజల్లుతూనే ఉంటా

తర తరాల 
మన జాతి గౌరవ 
విజయ కేతనం 
ఎగుర వేస్తూనే ఉంటా 

నారద తుంబుర
గాన మాధురిని 
కౌముది హృదయంలో 
పలికిస్తూనే ఉంటా 

హర హర మహాదేవ్ 

శివోహం  శివోహం

శివోహం

నీ అనంత భక్త జన కోటిలో....
ఓ నీటి బిందువును నేను....
అనంత విశ్వంలో ఓ రేణువులా.... 
నిను చేరాలని తాపత్రయం నాది....
మహాదేవా శంభో శరణు....

Sunday, August 30, 2020

శివోహం

దేవాధిదేవా...
మహాదేవా...
నిరతము నీ నామము భజించువాడను...
నీ అడుగు జాడలలో నడుచువాడను...
నీ ఆనకై నీ రాకకై నిను కాంచుటకై నీలో లీనమవుటకై   
పరిపరి విధముల ప్రార్ధించుచున్నను...
మహాదేవా శంభో శరణు

శివోహం

శివా! "ఓం"కారమున తెలిసె నీ తొలి శిశువు
"ఓం" కారము వివరించె నీ మలి శిశువు
ఆ "ఓం" కార జ్యోతి  నాకు తెలియనివ్వు
మహేశా.....శరణు.

శివోహం

జన్మలలో దారి తప్పిన మనస్సు
తెలియక చేసిన పాపాలు ఎన్నో
గాడి తప్పిన మతిని అనుసరించి
మనిషి చేసిన నేరాలు ఎన్నో

అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను 
ఎవరి తల అయినా 
ఎంత కాలం మోస్తుంది  
దూరాలు దుర్భరాలు 
కాకుండా ఉండాలి అంటే
భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు
ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్క డున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని
ఎలుగెత్తి పిలుస్తున్నాము

Saturday, August 29, 2020

అయ్యప్ప

నా దారి నీ దరికే కాదా తండ్రి...
ఈ దాసుడు నీ దివ్యచరణాల సేవకే...
నా అడుగడుగు నీ  కొండకే...
నా మదిహృది నిన్ను తలుచుటకే...
నా అణువణువు నీ ఆరాధనకే...
హరిహర పుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శివా!పాశాన కట్టి నన్ను పశువును చేసావు
బొడ్డు తాడుతో కట్టి నన్ను బయటకంపేవు
ఈ కట్టులన్నీ త్రెంచి నన్ను ఎగరేసుకుపో
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు
చిత్తములో వెతకండి...

భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు...
కానీ మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన మనకి కానరాడు...

మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు...
మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు...
మొదటిది అహంకారం, రెండవది మమకారం...

ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు....

జై శ్రీమన్నారాయణ
ఓం శివోహం... సర్వం శివమయం

గోవిందా

ఏమయ్యా వేంకటేశా ఏమిటి నీ లీల
చాలించుము నీ హేల వినవయ్యా మా గోల

భోగ మూర్తివి నీవు భోగాలకు కొదవలేదు
దిగులు దిగులుగున్నాము దిక్కు తోచకున్నాము
దిగులంతా మాకేలే నీ దర్శనమే కరువాయై
ఏమి నీ దరహాసము ఎందలకీ పరిహాసము

నీ సేవల కొరతలేదు మాకే ఈ వెలితంతా
ఎగబడి వస్తున్నారు సుర ముని సందోహం
లోపమేమిటో మాకు రూపు తెలియకుంది
శాపమేదో.. శోకంగా మారినట్టు ఉంది

ఏడు కొండలెడబాటు  ఏమిటి మా గ్రహపాటు
ఏ సేవలు చేయలేక నీ సేవలు చూడలేకా
విరహంతో మేము  విలయాన  మునిగేము
ఈ విలయానికి నీవే వరమునిచ్చినావ

ఆనంద నిలయాన అడుగు పెట్టి నిన్ను చూసి
పరవశాన కనులు మూసి ఎదలోన నిన్ను తలచి
కులశేఖర గడప చేరి కోర్కెలన్ని మరువనీ
అనుభవాల మాటకేమి అనుభూతిని పొందనీయి

Friday, August 28, 2020

శివోహం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.
మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.
బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.
చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.
అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.
ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.

హరే

ధర్మబద్ధమైన కోరిక అశాంతిని కలిగించదు.కోపాన్ని పుట్టించదు.మనసును శుద్ధి చేసుకోవాలంటే మొదటగా భగవంతుడు ప్రసాదించిన దానిని స్వీకరించాలనే భావం మనిషిలో కలగాలి.ఈ భావం వలన కోరిక అనేది నశించిపోతుంది. అపారమైన ప్రేమను భగవత్పరంగాను, భగవంతుని ప్రతిరూపమైన తోటి జీవుల పరంగాను పెంపొందించుకుంటే కోపం అనే మలినం తొలగిపోతుంది. త్యాగగుణాన్ని అలవరచుకుంటే లోభగుణానికి చోటుండదు. భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంచుకొనుటచేత మోహం కూడా దూరమైపోతుంది.ఈ ప్రపంచ సౌఖ్యాలన్నీ అనిత్యమనే వివేకం చేత మదము, మత్సరము రెండు మలినాలు కడుక్కుపోతాయి.

ఈ విధంగామనసుపై నుండు మలినములను శుద్ధి చేసుకోకుండా బాహ్య శుద్ధి ఎంత చేసినా భగవత్ప్రేమకు నోచుకోలేరు.

సర్వే జనా సుఖినో భవంతు.

శివోహం

శివా! ఊరూ వాడ ఉన్నది నీ లింగాకృతి 
ఊరవతల మాత్రం నీది ఈ ఆకృతి
ఊరు  వదలిన మమ్ము ఊరడిద్దామనా
మహేశా .... శరణు.

శివోహం

స్వార్థమే అనుకో 
స్వలాభమే అనుకో  తండ్రీ

నిన్ను 
ఉర్రూత లూగించే 
డమరుక నాదమై
మిగిలి పోవాలి 

నిన్ను 
మైమరిపించే 
శంఖా రావమై 
నిలిచి పోవాలి 

హర హర మహాదేవ్ 

శివోహం  శివోహం

Thursday, August 27, 2020

శివోహం

ఎగిరెగిరి 
ఎగిసెగిసి 

పడుతూన్న 
నా పంచ ప్రాణాల 

పతంగానికి 
దారమూ నీవే 

ఆ దారమూ నీవే
" ఆధారమూ నీవే తండ్రీ " 
శివోహం  శివోహం

శివోహం

రోజుకో రకంగా
పూటకో పద్ధతిగా
మార్పు చేసుకునే
మహాబుద్ధి నాకు వద్దు 

నీదైన ఒకే ఒక గురి
నాదైన గమ్య స్థానంగా 
నీవైన ఒకే ఒక లక్ష్యం
నాదైన లాంఛన ప్రాయంగా

సాగిపోనీ ప్రయాణం
సాధించుకోనీ నీ ప్రస్థానం తండ్రీ
హర హర మహాదేవ
శంభోశంకర శరణు శరణు

శివోహం  శివోహం

శివోహం

గుర్తుంచుకో 
ప్రియ మిత్రమా

శివుడు ప్రసాదించిన
తనదైన దేహంలో

తనది కానిది ఏదీ
తనలో ఎప్పటికీ ఉంచుకోడు

శివోహం  శివోహం

శివోహం

*దైవముపై ద్యాస కలుగడము అంత సులభము కాదు. మీ గత జన్మ పుణ్యఫలమో లేదా మీ వెనుకటి తరాల వారి భక్తి ఫలమో తోడైయుండట చేత నేడు మీకు దైవంపై స్పృహ కలిగినది. ఇది అందరికినీ చిక్కేటటువంటి అవకాశం కాదు. అయితే ఇందులో దైవ సంకల్పమూ లేకపోలేదు. మెుక్క పెరుగుటకు నీరే కాకుండా సూర్యకాంతి కూడా అవసరమే. దైవ శాసనముననుసరించియే సకల సృష్టి నడవగలుగుతుంది. మీ మీ పూర్వ సాధనల ఫలముల వలన దైవం మీకు నేడు దిశా నిర్దేశం చేయడం జరుగుతుంది. భగవంతుడు మీకు అవకాశములను మాత్రమే ఇస్తుంటాడు. మీరు చిక్కిన అవకాశమును వదలక దక్కించుకోవాలి.*

శివోహం

భక్తి అనే బావం మదురమైనది....
మనకు అత్మీయమైనది...
అది అద్వితీయమైనది...

ఓం శివోహం... సర్వం శివమయం.

ఓం

అంబాసుతుడవు లంబోదరా...
అఘములు బాపర లఘుమికర...
అమర వినుత ఇల ఆర్తుల బ్రోవరా...
సమరచతుర బల కీర్తులనివ్వరా...

ఓం గం గణపతియే నమః

శివోహం

శివా!మీరు ఇద్దరు ఒకటిగ అగుపిస్తే
నేను రెండును కలిపి ఒకటిగా అడిగేను
జ్ఞానవైరగ్యములు ఒకటిగా ఒసగమని
మహేశా ..... శరణు.

శివోహం

సర్వదుఃఖాలనూ...
సర్వ పాపాలనూ...
అన్ని బాధలనూ తొలగించేది...
నీ నామస్మరణొక్కటే తండ్రీ..
నా మదినే దేవాలయం గా చేసి నిను ప్రతిష్టించిన ఇక ఏ చింతా చేరదుకదటయ్యా...

మహాదేవా శంభో శరణు...

Wednesday, August 26, 2020

శివోహం

నా హృదయ స్పందనల
ఆయువు మూర్తికి

ఏ అఖండ హారతి  ఇవ్వగలను
ఏ అమోఘ మంత్రం  చదువగలను 

ఒక్క " ఓం నమః శివాయ " తప్ప .....

శివోహం  శివోహం

శివోహం

కాలమా !
ఈ దేహముపై !!

నీ శర పరంపరలు !
సంతోషంగా సంధించు !!

నాది కానిది ?
నాకు ఎందుకు ??

సర్వం శివార్పణమస్తు

శివోహం  శివోహం

శివోహం

స్వామి నీవు మహోన్నతుడవు
మీకు ఎన్నెన్నో కార్యాలు ఉన్నప్పటికీ
నన్నో వంక ఆలకిస్తూనే ఉంటావు
మహాదేవా శంభో శరణు

శివోహం

నా ఆకలి బాధను 
పతి పరమేశ్వరునికి సైతం 
తెలియనీయకుండా

ఏ పూటకూ పస్తు పెట్టని
మా అమ్మ  అన్నపూర్ణేశ్వరీ దేవిని 
నిత్యమూ స్మరిస్తూ

జగజ్జనని మంగళ గౌరి
మాత మహేశ్వరీ దేవికి 
సదా శరణు శరణు

శివానీ  శివోహం

శివోహం

శివ భక్తి 
ఎలా ఉండాలంటే 

పట్టు పట్టరాదు 
పట్టి విడువ రాదు 

పట్టెనేని 
బిగియ పట్టవలయు 

పట్టి విడుచుట కన్నా 
పరగ చచ్చుట మేలు

శివోహం  శివోహం

శివోహం

స్వామి నీవు మహోన్నతుడవు
మీకు ఎన్నెన్నో కార్యాలు ఉన్నప్పటికీ
నన్నో వంక ఆలకిస్తూనే ఉంటావు
మహాదేవా శంభో శరణు

ఓం

సృష్టికి శ్రీకారం 'ఓం'కారరూపంలో ఉద్భవించినది. వేదమంత్రాలు గణాలైతే వాటికి మూలమైన ఓంకారమే గణపతి. సనాతనధర్మంలో సర్వదేవతా శక్తులకు మూలం ఓంకారం. సృష్టారంభంలో, మంత్రంలో, యంత్రంలో, సమస్తదృశ్య ప్రపంచంలో, త్రికాలాదుల్లో, ప్రత్యణువులో ప్రస్ఫుటమయ్యే విశ్వజనీనమైన, విశ్వవ్యాప్తమైన, సర్వ సమగ్రమైన 'ప్రణవ'స్వరూపమే గజాననుడు. 
ఓం గం గణపతియే నమః

ఓం

ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.ఈ సృష్టిలో నిత్యం శబ్దప్రకంపనల ద్వారా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వమే గణపతి.

ఓం గం గణపతయే నమః

శివోహం

దేవాలయంలో దేవునిమూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు...

దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతరశుద్ధి కావాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

భగవంతుడే చైతన్యస్వరూపుడు, పూర్ణుడు, శాశ్వతుడు, సర్వస్వడు...

ఆ పరమాత్ముడే సత్యం ,సనాతనం...

అతని ప్రేమైక సృజనయే సృష్టి...

దివ్యమై, అనంతమై, అమృతమై, ఆనందమై, శివమై, దైవమై, సత్యమై, నిత్యమై, సనాతనమై బాసిల్లుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! కాలానికి వేగానికి పట్టుబడని నీ తేజం
చిరుదివ్వెగ  ప్రభవించి నాలోనే వసియించి
అగుపించని నేనుగా నడిపించెను నన్నుగా
మహేశా ..... శరణు.

Tuesday, August 25, 2020

శివోహం

ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.ఈ సృష్టిలో నిత్యం శబ్దప్రకంపనల ద్వారా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వమే గణపతి.

ఓం గం గణపతయే నమః

శివోహం

శరీరం దైవదత్తం...
మనస్సు మానవ కల్పితం
బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్షసిద్ధి తధ్యం...
ఓం నమః శివాయ.
ఓం శివోహం... సర్వం శివమయం

Monday, August 24, 2020

శివోహం

నీవైపు అడుగులు వేసే దారిచూపి
ఈ బ్రతుకు కట్టలు తెంచు, లేకపోతే
త్రిశంకు స్వర్గమే నా జీవితం బంధాలు
వదలలేను, నిన్ను విడిచి ఉండలేను
 మహాదేవా శంభో శరణు...

ఓం

జ్ఞానం, అజ్ఞానం - రెండింటికీ అతీతుడవు అయిపో. అప్పుడు మాత్రమే భగవంతుని తెలుసుకోగలవు. నానా విషయాలను తెలుసుకోవడం అజ్ఞానం. పాండిత్యం ఉందన్న అహంకారం కూడా అజ్ఞానమే. 'సర్వభూతాలలోనూ ఉన్నది ఒకే భగవంతుడే' అన్న నిశ్చయాత్మక బుద్ధియే జ్ఞానం. భగవంతుని విశేషంగా తెలుసుకొంటే అది విజ్ఞానం.

శివోహం

శివా!మాటలన్ని మూటకట్టి మూలపెట్ట
మనసు కూడా మురిపెంగా వెన్నుతట్టె
మనసు ఎరిగి మౌనాన నిలుపుమయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

నీతో చెలిమి కుదిరాక...
కొందరు నన్ను చిన్న చూపు చూసారు...
ఇంకా చూస్తూనే ఉన్నారు...
అయినా వారు నాకు ప్రత్యేకం...
ఎందుకంటే
అనుక్షణం వారి పెదవులపై నీ నామ జపం నాకపురూపం తండ్రి...

Sunday, August 23, 2020

శివోహం

శివా!ఏకం అనేకం అవడమంటే
పలు అవతారములు దాల్చడమనుకున్నా
ప్రతి రూపంలో ప్రభవించడమా...
మహేశా . . . . . శరణు .

Saturday, August 22, 2020

ఓం

ప్రణవమే భగవంతుడి నామధేయం. 
మనలో అంతర్భాగముగా వున్న శబ్దకారణమైన వాయువు నాభి వద్దనుండి అకార రూపముగా బయలుదేరి స్వరపేటికను స్పర్శించి, ఉకారముగా చైతన్యముతో స్వరపేటికనుండి వెలువడి, చివరికి మూయబడిన పెదవుల ద్వారా మకారరూపమున వెలువడుతుంది. అ+ఉ+మ అనగా అకార ఉకార మకార పూర్తిస్వరూపమే 'ఓం'. అదే ఓంకారం.
ఓం అనే శబ్దంతో అంటే నాదంతో స్వరూపముగా వెలువడింది కనుక అది ఓంకార నాదమైంది. ఆ నాదం వినువారలకు ప్రమోదాన్ని కల్గిస్తుంది కనుక అది ప్రణవనాదముగా భాసిల్లింది.
ఈ ఓం స్మరణం ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో కలిగే ఆటంకాలన్నిటినీ తొలగించి ఆత్మచైతన్యానికి తోడ్పడుతుంది. 
ఓంకార ధ్యానంవలన మనస్సు ఏకాగ్రత పొంది అంతర్ దృష్టి కలిగి ఆత్మావలోకానశక్తి క్రమక్రమముగా వృద్ధి పొందనారంభిస్తుంది. 

శివోహం

అంతో 
ఇంతో
కొంతో 

నేనూ 
నీ వాడినే 

కాస్త 
కళ్లు తెరిచి కరుణించు తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

పాప పుణ్యాల లెక్కలు కూడి
నీ పాద సేవకు దూరం చేయకు 

జమా ఖర్చుల పద్దులు రాసి 
నీ కైలాసంలో చోటు లేదనకు తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా!బ్రతుకెంత భారమైన నిన్ను తెలిసిన నాడు
అది దూది పింజవోలె తేలిపోవు
తెలియరావయ్యా ఈ బ్రతుకు తేలునటుల 
మహేశా . . . . . శరణు

Friday, August 21, 2020

వినాయక చవితి శుభాకాంక్షలు

జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు...
నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. 

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు, పెద్దలకు గురువులకు శ్రేయోభిలాషులకు 'వినాయక చవితి' శుభాకాంక్షలు...

శివోహం

శివా!నా చుట్టూరా చీకటి
చిక్కని చీకటికావల నీవు
దాటనీ చీకటి ముడిపడ నా భృకిటి
మహేశా . . . . . శరణు .

శివోహం

నేను నీలో కలిసిపోవటం అంటే...
నన్ను నేను తెలుసుకోవటమే కదా తండ్రి...
అందుకే నిన్నే నాలో కొలువుంచా...
మహాదేవా శంభో శరణు...

Thursday, August 20, 2020

అమ్మ

ఈ సృష్టికి మూలమైన శక్తి...

ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది...

మనస్సు శాంతిగా ఉండాలన్నా,
బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి...

అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి...

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే....

అమ్మ అనుగ్రహం ఉంటే వానికి లేనిదేమిలేదు...

ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీదుర్గదేవినే నమః

శివోహం

శివా! దేహ భావము విడిచి పెట్టి
ఆత్మ భావము ఒడిసి పట్టి 
అణువణువున నిన్ను చూడనీయి
మహేశా.....శరణు.

Wednesday, August 19, 2020

శివోహం

వర్షించే కళ్ళల్లో 
నీ రూపం అస్పష్టంగా 

మూగబోయే గొంతులో
నీ నామం గద్గదంగా 

తన్మయత్వమయ్యే తనువులో
నీ తత్వం తార్కికంగా 

నిత్యమూ 
నీ సన్నిధిలో

" ఏమిటీ  నీ మాయ తండ్రీ "

శివోహం  శివోహం

శివోహం

చివరి
ప్రస్థానంలో

హితుడైనా
స్నేహితుడైనా
సన్నిహితుడైనా
సంబంధీకుడైనా

బంధువైనా
బలగమైనా
ఆత్మీయుడైనా
ఆత్మ పరంజ్యోతివైనా

నీవే కదా తండ్రీ
హర హర మహాదేవ్

శివోహం  శివోహం

శివోహం

శివా!లోకాలేలే పని పెట్టుకొని
 నాలో నాకై కనిపెట్టుకొని
 కడకు కాటివద్ద కాచుకున్నావా
 మహేశా . . . . . శరణు .

శివోహం

కాలపు తెరపై....
చావుపుట్టుకల చక్రాన్ని ఓ తిప్పేస్తూ ఉంటావు.....
అలసిపోవా పరమేశ్వరా.........

చావుపుట్టుల చక్రం లో పుట్టి గిట్టి నేనైతే అలసిపోయాను.....

ఇక నీ ఆటలు ఆపు తండ్రి నేను అడలేను...

మహాదేవా శంభో శరణు...

Tuesday, August 18, 2020

శివోహం

ఉదయకాలపు బ్రహ్మవు...
మధ్యాహ్న రుద్రుడవు...
సాయంకాల నారాయణుడవు...
నీవే నా మదిలో మెదిలే దేవదేవుడవు...
సోమ,  సూర్య, అగ్నులు నేత్రాలుగా గలిగిన దేవా...
ఆతేజములే మాకు మూడు రూపాలుగా  అగుపించెను పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

వర్షించే కళ్ళల్లో 
నీ రూపం అస్పష్టంగా 

మూగబోయే గొంతులో
నీ నామం గద్గదంగా 

తన్మయత్వమయ్యే తనువులో
నీ తత్వం తార్కికంగా 

నిత్యమూ 
నీ సన్నిధిలో

" ఏమిటీ  నీ మాయ తండ్రీ "

శివోహం  శివోహం

శివోహం

సుఖాల్లోనే కాదు...
కష్టాలలో కూడా...
నేనున్నానంటూ ఆప్యాయంగా...
హత్తుకునే నా కన్నీళ్లు...
కోరికల బరువును తాళలేక...
ఉప్పేనల ఉబికి వస్తుంది...
కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని రుచి చూపిస్తుంది...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...