Saturday, August 15, 2020

శివోహం

సమస్త భూతములను సృష్టించేది, పోషించేది, లయంచేసేది ఆ పరమత్మే.

అలలు సముద్రంలోనే పుట్టి, కొంతసేపు ప్రయాణించి, తిరిగి ఆ సముద్రంలోనే కలిసి పోతాయి. 

వర్షంలో పైనుంచి పడ్డ చినుకుల వల్ల క్రింద పారే నీటిలో బుడగలు పుట్టి, కొంత దూరం ప్రయాణించి, అందులోనే 'టప్' మని పగిలిపోతాయి.

స్వప్నం అనేది నిద్రించిన జీవుడి మనస్సులో సృష్టించబడి, కొంతసేపు ఉండి, తిరిగి ఆ మనస్సులోనే లయమై పోతుంది.

అలాగే ఈ జగత్తు లోని జీవుళ్ళు అన్నీ కూడా ఆత్మయందే పుట్టి, కొంత కాలం ఉండి చివరకు ఆత్మయందే లయమైపోతాయి.

సూర్యుడు, 
చంద్రుడు, 
నక్షత్రాలు, 
అగ్ని, 
దీపం, ఇవన్నీ వెలుపలి జ్యోతులు.

కన్ను, 
ముక్కు, 
మనస్సు, 
బుద్ధి ఇవన్ని అంతరంగ జ్యోతులు.

ఇవన్నీ స్వయం జ్యోతులు కాదు.

ఎవరో ఒకరు శక్తినిస్తే వెలిగేవి మాత్రమే. 
‘వేడినీరు’ అన్నప్పుడు వేడి ఆ నీటిది కాదు. అది అగ్ని లక్షణం. అలాగే ఈ జ్యోతులన్నింటికి వెలిగే శక్తి వాటిది కాదు. ఆ శక్తి ఆత్మది. సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అని సైన్స్ చెబుతుంది. కాని అవి కూడా ఆత్మ యొక్క శక్తి వల్లనే ప్రకాశిస్తున్నాయి. అలాగే మన కన్ను, ముక్కు మొదలైన ఇంద్రియాలు కూడా ఆత్మశక్తి వల్లనే పనిచేస్తున్నాయి. అన్నింటిని తెలుసుకో గలుగుతున్నాయి.

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...