*ఆకాశానికి భూమికి నడుమ*
*ఆధారమేలేని*
*అందమైన బంగారుపంజరంలో*
*బంధీనై ఉన్నానిన్నినాళ్ళూ!*
*పనిలేక రెక్కల పాటవము*
*పరీక్షించే వీలే లేదిన్నాళ్ళూ!*
*దుఃఖపువేవిళ్ళలొనే కాలమంతా*
*దశాబ్దాలుగా పురుడు పోసుకుని*
*యుగాంతమైనా దిగంతాలలోకి ఎగిరిపోతునే* *ఉంది అయినా నాలో చలనంలేకుండా*
*దిక్కూమొక్కూ లేకుండా*
*శూన్యంలో గ్రహ శకలంలా*
*బరువేలేని బానిసనై బ్రతుకీడ్చాల్సివచ్చింది*
*బంధించిన ఒంటరి తనపు కట్టుబాట్లు,ఆంక్షల* *పంజర కమ్మీలు*
*పటాపంచలూ చేశానీరోజు...*
*రెక్కలు విప్పిన విహంగమునై*
*స్వచ్ఛగగనాన స్వేచ్చావాయువులు పీల్చాను*
*చచ్చుబడిన రెక్కలలో నవచైతన్య శక్తి ఇంధనంగా*
*ఎక్కుపెట్టిన శరమునై అవకాశ ఆకాశవిపణిలో*
*నా గమనరేఖలు నేనే లిఖించుకుంటూ*
*గమిస్తుంటా స్వేఛ్చగా గగనవిహారినై....!*
*అవకాశాల ఆకాశాన్ని ఏలే ఆకాశరాజుగాఎగిరి* *పోతుంటానుగమ్యంవైపు...!*
*వస్తారా ....😊మిరుకుడా...!*
No comments:
Post a Comment