Tuesday, August 4, 2020

శ్రీరామా

శ్రీ రాం జయరాం జయ జయ రాం
రాముని తలవని హిందువుండునా
రాముని గుడి లేని ఊరు ఉండునా
రాముని కళ్యాణం లేని గుడి ఉండునా
రాముడు ఒక మార్గదర్శకుడు
సీతారాములే అన్యోన్య దంపతులు
రామలక్ష్మనులే అపురూప సోదరులు
దశరథ రాములే అద్వితీయ తండ్రి కొడుకులు
హనుమ రాములే అచంచలమైన భక్తులు
గుహుడు సుగ్రీవుల తోడ మైత్రే మైత్రి
రుచిచూసిన పళ్ళను పెట్టిన శబరి ఆతృతే ఆత్రుత
ఆహల్య శాప విమోచనమే అద్భుతం
రామా నీ బాణం శక్తికి తార్కాణాలు ఎన్నెన్నో….
అంతేనా…
రాజ్యపాలన, ధర్మరక్షణ, మిత-ప్రియ భాషణ
కష్టాల చెదరని నీ మనో నిబ్బరత
లక్ష్యసాధన లో అకుంఠిత కార్యాచరణ
దీనబంధు రక్షణ లో అపరిమిత కారుణ్యం..
ఎన్నని ఎంతని ఏమని పొగడుద రామా
మా మనసు, విజ్ఞానం చాలా పరిమితం రామా
నీ నామ కీర్తన మాకు సదా రక్ష రామా
అదొక్కటే మాకు తెలుసు శ్రీ రామా
మము సదా కాపాడు లోకరక్షకా రమా….

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...