Tuesday, September 1, 2020

శ్రీరామ

భగవంతుడు పరమ ప్రేమస్వరూపుడు, దయామయుడు. తన భక్తులు పిలచిన తక్షణమే వచ్చి ఆదుకుంటాడు. తెల్లవారక మునుపే తనను ఎవరైనా స్మరిస్తారేమో పిలుస్తారేమో అని మన పిలుపు కోసం కాచుకు కూర్చుంటాడట! కానీ మనం సూర్యోదయం అయిపోయి 8 దాటాక లేచి ఏ పేపరో లేదా వాకింగో లేదా సెల్ నో చూసుకుని ఉంటుంటాం. లేచిలేవగానే భగవంతుని స్మరిద్దామనో లేదా వేగంగా కాలకృత్యాలు తీర్చుకుని ధ్యానమో, జపమో ,తపమో చేద్దామని అనుకోము. రోజంతా నానా వృథా మాటలతో చేష్టలతో కాలం గడిపేస్తుంటాం కానీ భగవంతుని స్మరించడానికి మాత్రం సమయం ఉండదు. పైగా ఏదైనా సమస్య వస్తే దైవము మీద పడతాం! ఇచ్చిన, వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యపరచి భగవంతుని మీద నిందలు వేస్తే ఎలా? అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదని అంటుంటారు కదా! కనుక వేకువనే లేచి భగవంతుని పిలవండి, తలవండి, స్మరించండి, భజించండి. ఆయన మంగళ రూపమును ధ్యానించండి. మీ అరికాలిలో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకుంటాడు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...