Saturday, October 31, 2020

శివోహం

ఇహమూ దేహము మరవాలీ.....
మదిలో అయ్యప్పను నిలుపాలి....
గానము నీ ధ్యానము కావాలీ....
కార్తీకం లో అయ్యప్పను కొలవాలి....
ముక్తినే కోరుతూ భక్తిలో మునుగుతూ....
భక్తి ముక్తి కలయికలో అయ్యప్పను తలుచుకొని...
నీవే అయ్యప్పవని తెలుసుకోవాలి.....

#ఓం_శ్రీ_స్వామియే_శరణం_అయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నిశ్శబ్దం నుండి శబ్దంగా నీవు
శబ్దం నుండి నిశ్శబ్ధానికి నేను
మన కలయిక ఎప్పుడో ఎక్కడో
మహేశా . . . . . శరణు .

శివోహం

సర్వ సృష్టి స్థితిలయ కారకా...
అండపిండ బ్రహ్మాండనాయక...
తండ్రి వాడవు నీవని...
నీ అండ చేరితి తండ్రి...
నీ కరుణ లేని ఈ జన్మ ఎందుకు...

మహాదేవా శంభో శరణు...

Friday, October 30, 2020

శివోహం

శివాసదాశివాయ... 
సదా లోక కళ్యాణ కారణాయ... 
సదా సృష్టి సంరక్షకాయ... 
సర్వ జీవ పోషకాయ... 
ఆరోగ్య ప్రదాయ... 
అంబ సమేతాయ... 
మహాదేవాయ... 
మంగళప్రదాయ... 
శ్రీ వైద్యనాథాయ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శరీరమనే క్షేత్రంలో మంచిపనులను విత్తనములుగా చల్లి...

భగవన్నామస్మరణమనే నాగలితో...

నీ హృదయమే రైతై దున్నినట్లయితే...

నీ అంతఃకరణలోనే భగవంతుడు ఉదయిస్తాడు...

*గురునానక్*

Wednesday, October 28, 2020

శివోహం

చీమ నుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుంది...
సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే....
శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు...
అంటే మృతపదార్థమని అర్థం...
శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం ,శివమే అనంతం , శివమే జ్ఞానం , శివమే చైతన్యం, శివమే సర్వజగత్తులకు మూలాధారం....
ఇదే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! ఉన్నానని అనిపిస్తూ ఎన్నాళ్ళని దాగేవు
ఇలా అన్నానని వినిపిస్తే అగుపించుము ఒక్కసారి
ఈ జన్మ  జగతి చక్రమున తిరుగ కడసారి
మహేశా.....శరణు.

శివోహం

శివా!నాకున్నవి  ఎన్నెన్నో ఇక్కట్లు
అవన్నీ నీ కనికట్లు...మరి
అధిగమించ ఏవి మెట్లు.
మహేశా.....శరణు.

శివోహం

శివా!అజ్ఞానాన్ని అణచిపెట్టి కూచున్నావు
వీరాసనాన వెలిగి పోతున్నావు
మౌనంగా జ్ఞాన బోధ చేస్తున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!విశ్వాసానికి శ్రీ కారం మిడగా
ఓం కారంలో నీ ఆకారం మిడగా
అయ్యేను నేడు సాకారం నీ దయగా
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రతి అడుగూ
నీ వైపు సాగిపోతూ ఉంటే

ఆ ఆనందామృత బిందువులను
అంతరాంతరాల్లో ఆస్వాదిస్తూ

ఆ అడుగుల వెనుక
చివరిలో నేను ఉంటాను తండ్రీ

శివోహం  శివోహం

Saturday, October 24, 2020

శివోహం

శివా! వేదాలన్నిటా నీవేనంట
వాదాలన్నీ వ్యర్ధమేనంటా
నాదాలన్నిటా నిన్నే వింటా
మహేశా. .....  శరణు.

Friday, October 23, 2020

శివోహం

సృష్టి, స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.
ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.
అమ్మ కరుణ ఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ మటుమాయమైపోతాయి....

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః
ఓం శివోహం... సర్వం శివయమం

Thursday, October 22, 2020

శివోహం

విశ్వమంత వెలుగు జేయు...
లోకేశ్వరుడే సర్వలోకనికి దిక్కు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు...
నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది...

ఓం గం గణపతియే నమః

శివోహం

నీవు ఎలా ఉన్నావో....
ఏం చేస్తున్నావో...
ఏం తింటున్నావో....
కాటిలో తిరుగుతూ ఒక్కడివే....
మా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావో తండ్రి....
నన్ను పిలుచుకుంటే నీ వెంట నేను కూడా తిరుగుతుంటా కదా...
అమ్మకు నీకు సేవా చేస్తూ ఉంటా కదా తండ్రి...

మహాదేవా శంభో శరణు.....

శివోహం

శివా!బయట చూపున కన్ను బడసిపోయింది
లోచూపు తెలియక నిలిచిపోయింది
నీ చూపు కలిసిందా లో చూపు తెలిసేను
మహేశా . . . . . శరణు .

Wednesday, October 21, 2020

శివోహం

శివ!!!!పట్టుబట్టి విల్లెక్కుబెట్టి.....
మట్టు బెట్టాలి నాలో ఉన్న ఆవేశాన్ని....
నీ ఆరాధనాకు అడ్డుగా ఉన్న నా ఆహాన్ని.....
నీవే తెలియ జేయాలి నాలోనే నీవున్నావని.....

మహాదేవా శంభో శరణు...

అమ్మ

ఏమి ఎరుగని నన్నింత..
వాడని చేసితివి...
నిన్నెల మరిచేద...
నిత్య అనుష్ఠానమందు...
నిన్ను ధ్యానించ నేనుండగా...
మమ్ము కణుకరించి...
అరిషడ్వార్గాలు తుద ముట్టించి...
నా హృదయమనే సింహాసనానికి రా రాజువై మమ్మేలుకో...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!ఆనోట ఈ నోట నలుగుతున్నట్టు
వేయి నామాలు నీకన్నది ఒట్టి కల్ల
సర్వ నామాలు మరి నీకే చెల్ల
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా మహాదేవా...
కాశీ పురవాసా... 
త్రయంబకేశ్వరా... 
గంగనెత్తుకొని మా'గొంతు తడిపే జంగమయ్యా... 
నీ పాదారవిందములే నాకు నిత్యమూ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

విఘ్నము బాపే గణపతినీవని.....
తొలుతగ నిన్నే కొలిచితిని.......
విద్యలనొసగే గురువు నివేనని.....
పూజలు చేసితిని నే హారతి పాడితిని....
గణనాధ నాలో అజ్ఞానపు చీకటి వదిలించు...
నన్ను జ్ఞాన మార్గంలో నడిపించు పర్వతీపుత్ర.....

ఓం గం గణపతియే నమః

Monday, October 19, 2020

శివోహం

శివా!మనసుపడి వచ్చాను నీ వనంలోకి 
మౌనమంటె మనసాయె నీ మౌనం చూసి
మనసు మూగబోవాలి నా మౌనం తెలిసి
మహేశా . . . . . శరణు .

శివోహం

నిస్వార్థంగా ఆలోచిస్తే అందరూ మంచివారే...
నీ స్వార్థంగా ఆలోచిస్తే అందరూ చెడ్డ వారే...
పుట్టుకతోనే గ్రుడ్డి వారిగా, చెవిటి వారిగా, మూగ వారిగా పుట్ట వచ్చును..
కానీ....
పుట్టుకతోనే ఎవ్వరూ చెడ్డ వారిగా మాత్రం పుట్టరు...
గతం నుండి మోసుకు వచ్చిన సంస్కారాలు, వాతావరణ ప్రభావం, మానసిక వివేకం ప్రభావితం చేస్తాయి..
అందుకే పెద్దలు అంటారు సత్ సాంగత్యం తేల్చుతుంది...
కుస్సంగత్యం ముంచుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

అమ్మ

సృష్టి,  స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిణీ...
ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది...
పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి...

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీ మాత్రే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

భగవానునిపట్ల అమితమైన ప్రేమే భక్తి...
భగవానుని దివ్యలీలలయందు,మహిమలయందు, గుణగానంలయందు,నామసంకీర్తనలయందు దైవవిషయాలు శ్రవణమందు మనస్సును లగ్నం చేయుటయే భక్తి....
భక్తి ప్రాప్తించుటకు విద్య యొక్క ఆవశ్యకత లేదు...
ఉన్నత వర్ణాశ్రమములు అవసరం లేదు....
ధనం అవసరం లేదు....
వేదాధ్యయనం, తపస్సులు అక్కరలేదు....
అపారమైన విశ్వాసముతో నిరంతరం భగవంతున్ని స్మరిస్తే చాలు.

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, October 18, 2020

అమ్మ

జీవన గమన మునకు ఆధారం నివు...

జీవుల శ్రేయసు కోరు జగదాంబవు నివు...

జగత్ గురువు స్థాపించిన జగన్మాతవు నివు...

దీనజనావని పతితపావనీ దిక్కు చూపవే తల్లీ దరిజేర్చు కల్పవల్లీ....

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివా!అణువు అణువునా నీవు
అణువున పరమాణువుగా నేను
తనువుగ నేను తనువున నీవు
మహేశా . . . . . శరణు .

శివోహం

మతిమరుపు వాడినని మతిమరపును నాలో మరీ మరీ పెంచకు తండ్రి...
నా ఆత్మ విశ్వాసాన్ని అసలే సడలించకు...
తప్పటడుగు వేయించకు శంకరా...
తప్పులు అస్సలే చేయించకు తండ్రి ....
నీ పాదం విడవని భక్తిని ప్రసాదించు...
పాత్ర మార్చి కరుణించు నంది పక్కనే పడి ఉంటా...

మహాదేవా శంభో శరణు........

Friday, October 16, 2020

అమ్మ దయ

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు, పెద్దలకు , గురువులకు దేవినవరాత్రి శుభాకాంక్షలు...

మీరు తలిచిన వెంటనే అమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ...
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే..

శివోహం

ఎన్ని జన్మలెత్తినా నీరూపం మానవులకు అపురూపమే మాధవా ....

ఎన్ని పరిమళాలు తాకినా నీ తలపు పరిమళం సుగంధమే మాధవా....

ఎన్ని స్వరాలు విన్నా నీ మురళీ గానం మార్దవమే మాధవా ...

ఎన్ని నామాలు స్మరించినా నీ నామం అనునిత్యం 
ఆనందమే మాధవా ..

శివోహం

శంభో!!! నీ నామ ధ్యానం లో మునిగిన నేను...
ఆ భక్తి పారవశ్యం లో నన్ను నేనే మరచి పోతుంటాను...
నువ్వే నేనని తలుస్తుంటాను...
మహాదేవా శంభో శరణు...

Thursday, October 15, 2020

శివోహం

శుభ శోభనకారిణి...
వాంచితార్ధ దాయిని..
తామస హారిణి...
తాపస కారిణి...
శ్రీ బాల రూపిణి….
నిత్య సువాసిని...
కరుణించవే మము కమల లోచని...
క్పప జూడుమా మా దుర్గభవాని...

ఓంశ్రీమాత్రేనమః
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! విశ్వమంత వెలుగులొ కానరాదు నీ రూపం.
అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం
గమం నెరిగించు గమ్యం చేర్చు గంగాధరా
మహేశా.....శరణు.

శివోహం

కళ లేని జీవితం 
నిర్భరం దుర్భర శూన్యం !
కళ లేని కళ్ళు 
నిర్జల కఠిన శిలా కాసారాలు !!

అలా అలా 
గుండెను కోసేస్తూ !
అదే అదే 
గుండెను పిండేస్తూ !!

శివ తత్వాన్ని 
శివ మహత్తుగా !
ఎలుగెత్తి చాటుతున్న 
ఈ చిరంజీవులకు !!

భావమే ప్రధానం కానీ !
భాష కానే కాదు !!

శివోహం  శివోహం

శివోహం

తను తిన్న
వెన్న ముద్దలు
తన కోసం కాదయ్యా ?

నీలో ఉన్న
అగ్ని పర్వత సమూహాలను
సముదాయించడానికే తండ్రీ

ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ

శివోహం  శివోహం

శివోహం

కాలమా 
ఎందుకంత తొందర ?
కాస్త నిదానంగా 
సాగిపో మిత్రమా ??

కైలాసవాసుని సన్నిధిలో 
నా జీవిత కాలం !
ఒక్క క్షణం మాత్రమేనని
నీకు ఎలా చెప్పగలను !!

శివోహం  శివోహం

శివోహం

పంచ భూతాలలో...
పంచ ప్రాణాలలో...
నాలో ఉంటూ...
నీలో ఉంటూ...
నన్ను ఇంత గొప్పగా.  
తయారు చేసిన వాడిని...
ఎంతని పొగడను...
ఏమని వర్ణించను...
శరణు వెడడం తప్ప...
మహాదేవా శంభో శరణు

శివోహం

నీవు నా మదిలో సదా కొలువై
నా తలపుకు నెలవై
నాకు చేరువై ఉంటూ నన్ను కాపాడుతూనే ఉన్నావు...
కానీ నేనే అహంకారం తో నిన్ను కనలేకపోతున్న...
హరిహర పుత్ర అయ్యప్ప శరణు 
మణికంఠ శరణు...

Wednesday, October 14, 2020

శివోహం

శివా! దేహములో ఉన్నా నీవు దేహివి కావు
దేహముతో ఉన్నా నేను దేహముకాదు
అంతా అయోమయం. జగమంతా శివమయం
మహేశా ..... శరణు..

శివోహం

బరువైన బాధలను కన్నీటితో...
మోసేస్తూ ఉండాలి మరి...
ఎందుకంటే జీవిత నాటకంలో...
ఆటాడించే వాడు ఒకడుంటాడు...

ఓం శివోహం.. సర్వం శివమయం

శివోహం

జారిపడే కన్నీటి బోట్టు 
బరువుగా వుండకపోవచ్చు కానీ 
దానిలో దాగివున్న బాధ మాత్రంబరువైనదే తండ్రి...

శివ నీ దయ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా నేను నిన్ను వెలుపల వెదుకుతున్నా...
నీవేమో నాలో దాగుడుమూతలాడి...
క్షణం కనిపించి లోపలకెళ్ళిపోతున్నావు...
బయటైతే ఎవరినైనా అడగవచ్చు...
లోపల ఉన్న నీ గురించి తెలుసుకోవాలంటే
నాతో నేను మాట్లాడుకోవాలి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ప్రాణిగా నేను
ప్రాణంగా నీవు
దేహంగా నేను
దేహిగా నీవు
భేదంగా నేను
అభేదంగా నీవు
నువ్వే నేను నేనే నువ్వు...
మహాదేవా శంభో శరణు...

Tuesday, October 13, 2020

శివోహం

వేడి కంటి వాడు...
వేల కన్నుల వీడు...
పామును మెడలో వీడు..
పాము పైనే వాడు...
పేరు,రూపము వేర్వేరు...
గాని వీరు యిద్దరు ఒక్కటే...

ఓం శివకేశవయ నమః

Monday, October 12, 2020

శివోహం

శంభో!!!
నాలుగు గదులు...
ఒక ఊపిరి దారి...
1. గణపతి, 2. సుబ్రహ్మణ్యం, 3. నంది, 4. అమ్మవారు, 5. ప్రధాన దేవుడవు నీవు...
నా హృదయమే నీకు పంచాక్షరీ మంత్ర స్మరణతో ఓ పంచాయతన క్షేత్రం...
మరి నీపరివారాన్ని పురమాయించి ఈ క్షేత్రానికి రక్షణ ప్రహారికి పహారా ఏర్పాటు చేయి పరమేశ్వరా...
నిను నమ్మి మిమ్మల్ని అయ్యప్ప స్వామితో సహా అందరినీ నా హృదయములో నిలుపుకున్నాను...

తర్వాత నీ దయ

మహాదేవా శంభో శరణు...

ఓం గం గణపతియే నమః

భక్తిమాత్రమే పరమార్ధజ్ఞానమును కలుగజేయును.
భక్తి యొక్కటియే సంసారరోగమును నశింపజేయును.
భక్తి యొక్కటియే పరతత్త్వమును కలుగజేయును.
భక్తి యే ముక్తినిచ్చును.

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, October 11, 2020

శివోహం

శంభో ! నీ ధర్మకాటా లో...
నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా...
నన్ను వదిలేయకు తండ్రీ...

మహాదే6శంభో శరణు...

శివోహం

శివా!అష్టోత్తరమైనా సహస్రమైనా
నేను సమర్పించే కుసుమ మొకటే
ఎద కుసుమం, గ్రహించు అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .

శివోహం

వెండికొండలో ఉండు వేదవిదుడవు నీవు... 

మూడుకన్ను లుండి ముల్లోకములను...
యేలే గరళకంఠడవు నీవు....

నిర్మలా హృదయ దయాంతరంగుడు....
విభూతినమేయుడు నీవే కదా తండ్రి....

మహాదేవా శంభో శరణు....

Saturday, October 10, 2020

అయ్యప్ప

ఉదయ భానుడు వచ్చి చాలా సేపైంది...

ఉదయాన్నే నా ఇంటికి వస్తానని కలలో మాటిచ్చావు...

వేకువ రేఖలు తూర్పు తలుపుల వాకిట సవ్వడి
చేయక ముందునుంచే నీకోసం ఎదురు చూస్తున్నాను...

శబరిగిరి దిగిరా తండ్రి నా కన్నీటి సంద్రం లో జలకమడిపో....

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...