పిచ్చివాడివో వెర్రివాడివో
తిక్కలోడివో తెలియనోడివో
జడలు కట్టు ఆ జటలు ఏలనో
నెత్తి మీద ఆ గంగ ఏలనో
వంక బూనిన జాబిలేలనో
మెడను చుట్టు ఆ పాములేలనో
మూడు కన్నుల మర్మమేలనో
మౌన ముద్ర ఆ ధ్యానమేలనో
జనన మరణాల చక్రమేలనో
కట్టె కొనల ఆ చితులు ఏలనో
భిక్షమెత్తు ఆ బ్రతుకు ఏలనో
కాటి కాపరి కొలువు ఏలనో
ఒంటి నిండా ఆ బూడిదేలనో
తెలియరాని ఆ తత్వమేలనో
No comments:
Post a Comment