వేగిరపడుతున్న ఈ మనసుని
నువ్వు ఎప్పుడు
ఆదరిస్తావు స్వామి!!
నీ అడుగుల తివాచీలా
ఉబలాటపడి పరిచిన
హృదయ సీమకి
నువ్వు వచ్చేవని,
అంతా నీ అడుగుల
అచ్చులే ముద్రితమని
తెలిసేరోజు కోసం
ఈ జీవిత సమస్తం
వేచిఉన్నది,
ధర్మానికి వేదిక....
నీ ముందర ఉండడమే
నా ఆత్మకు కాంక్ష....
నేను అంతా నిరీక్షణగా
మారి ఉన్నాను,
నీ ప్రతిక్ష పొందడమే పరమావధిగా
ఈ అనంత జలనిధి
దాటెందుకు నీచేయూతలో
నాలోనుండి
నాలోకి
ప్రయాణించే
గమనాన్ని
వేగంగా మార్చు,
మరెక్కడ ఆగకుండా
నిన్ను చేరేందుకు
ఉరవడి ఉండనీ
గట్లు తెగిపోయి స్వామి...
No comments:
Post a Comment