ఎన్ని మారులు పాడిన
వన్నె తరగదు నీ పాటకు
ఎన్ని మారులు విన్నా నీ మురళి స్వరాలకు
మరచిపోవాలన్నా ఓ మాధవా!
మరపురాదు నీ పేరు!
విడిచిపోవలన్నా వీడిపోదు
విడవని భందం మనది ఏనాటిదో!
తీయని నీ మురళినాదం
తీపిదనం కురిపిస్తుందిప్పుడు!
నర్తన చేస్తుందిప్పుడు నా యదలో!
నవ్య సుందరములను వెలువరిస్తూ
అందుకే అర్పిస్తున్నా ఆత్మార్పణమని!
ఆవేదనతో నీ మధుర గీతాలను!
యుగ యుగలునాటి నీ మధుర పదాలు!
తర తరాలునాటిదీ హృదయ వేదన!
No comments:
Post a Comment