Tuesday, December 8, 2020

శివోహం

శంభో!!!
సదా నీ రూప స్మరణము
నీ నామ శ్రవణం చేయ నేను తపించాలి 
సదా నిన్ను అర్చింప
నీ పదసేవ చేయ నా కరములు ఉత్సహించాలి
సదా నిన్ను కీర్తింప
నీతో సఖ్యము చేయ నా మది ఉరకలెయ్యాలి
సదా నీకు దాస్యము చేయ
వందనం చేయ నేనుప్పొంగాలి
సదా సర్వదా ఆత్మ నివేదన చేయ నేను పరితపించాలి
నవవిధ భక్తి మార్గాల నిన్ను చేర
నా మార్గం సులభం చేయవయ్య శివ

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...