Saturday, January 23, 2021

జై శ్రీరామ్

ధర్మబద్ధమైన కోరిక అశాంతిని కలిగించదు.
కోపాన్ని పుట్టించదు.
మనసును శుద్ధి చేసుకోవాలంటే మొదటగా భగవంతుడు ప్రసాదించిన దానిని స్వీకరించాలనే భావం మనిషిలో కలగాలి.
ఈ భావం వలన కోరిక అనేది నశించిపోతుంది.
అపారమైన ప్రేమను భగవత్పరంగాను, భగవంతుని ప్రతిరూపమైన తోటి జీవుల పరంగాను పెంపొందించుకుంటే కోపం అనే మలినం తొలగిపోతుంది.
త్యాగగుణాన్ని అలవరచుకుంటే లోభగుణానికి చోటుండదు.
భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంచుకొనుటచేత మోహం కూడా దూరమైపోతుంది.
ఈ ప్రపంచ సౌఖ్యాలన్నీ అనిత్యమనే వివేకం చేత మదము, మత్సరము రెండు మలినాలు కడుక్కుపోతాయి.

ఈ విధంగామనసుపై నుండు మలినములను శుద్ధి చేసుకోకుండా బాహ్య శుద్ధి ఎంత చేసినా భగవత్ప్రేమకు నోచుకోలేరు.

సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...