Tuesday, January 12, 2021

శివోహం

సిందులేసే గంగమ్మను......శిరాన భెడ్తివి
అడగకుండనే గౌరమ్మకు.......సగం పెయ్యనిస్తివి
వంకరైన సెందురుని.......తలపైన పెడ్తివి
సక్కనైన దేవర......సల్లనైన శంకర

బుసలుకొట్టె పామునేమొ......మెడలోన  చుడ్తివి
రక్తమోడుతున్న చర్మాన్ని.....ఒంటికే కడ్తివి
కాష్ఠంలో బూడిద...........పెయ్యకంత పూస్తివి
సక్కనైన దేవర.............సల్లనైన శంకర

 
బేసి కంటిలోన........నిప్పునె దాస్తివి
చక్కని గొంతులోన......విషమునె పెడ్తివి
కాటికేమొ దొరవై........కాపురమె పెడ్తివి
సక్కనైన దేవర.........సల్లనైన శంకర్

శంకరా ఆని పిల్వంగనె..........సంకనెత్తుకుంటివి
కావరా అని అర్వంగనె...........కంటిలోన దాస్తివి
మనసునిండ తల్వంగనె........మనసులోన పెడ్తివి
సక్కనైన దేవర..........సల్లనైన శంకర   

No comments:

Post a Comment

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...