Sunday, February 7, 2021

శివోహం

శివుడిని అంగీకరిస్తే జీవితాన్ని అంగీకరించినట్లే.

మనం శివా అన్నప్పుడు మీరు ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ప్రతి మానవుడు అనుభూతి చెందేవన్ని
అనుభూతి చెందాడు. ఆయన ఒకే సమయంలో ఎన్నో గుణాలని కలిగిన వాడు.

ఆయన అతి సుందరుడు ఆయన వికృత రూపుడు
ఆయన గొప్ప తపస్వి అలాగే సంసారి కూడా.ఆయన
ఎంతో నిష్టా గరిస్టుడు అద్భుతమైన తాండవం చేయ
గలడు. అచంచల నిశ్చ లత్వం కలిగిన వాడు.

దేవుళ్ళు ఆయనని పూజిస్తారు రాక్షసులు అరాది
స్తారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు ఆయనని ఆరాధిస్తాయి. మనం శివుడు గురించి ఏమి చెప్పినా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే. ఈ ప్రపంచానికి విరుద్ధమైనది కూడా ఆయనదే.

ఆయన భైరవుడు ఎంతో కోపం కలిగి ఉన్నవాడు
రౌద్ర స్వరూపుడు హింసాత్మక స్వభావం ఆయన
ఎంతో కరుణామూర్తి కూడా. ఆయనే సుందర మూర్తి.

ఆయన సమ్మోహితుల్ని చేస్తారు. మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమికుడు. ఎంతో దయ కలిగిన అందగాడు.
ఆయన నాట్యం సృష్టి స్థితి గతులను లయం చేస్తుంది

సంపూర్ణం నిశ్చలుడు అదే సమయంలో ఏ కదలికా లేనివాడు. శివుడు ఒక యోగి వైరాగి. ఆయనకు పేరు
పెట్టలేం. ఆయనకు ఒక నామం ఇస్తే ఆ నామం పరిమితం చేసినట్టే. అదే సమయంలో ఆయనకు ఉన్న అనేక అనేక నామాలను ఒక్కటిగా చేరిస్తే అదే అనేక బ్రహ్మాండములను ఒక్కటిగా చేస్తుంది.

అందులో ఉన్న సంక్లిష్టతలు మనకు అంతుచిక్కని విషయాలకు ప్రతినిధి ఆయనే. శివు డి ని మీరు అంగీకరించే కలిగితే దాని అర్థం ఇంత సంక్లిష్టమైన వాడు. మీరు ఆలోచించే ప్రతి గుణానికి ఒక రూపం.

శివుడిని మీరు అంగీకరిస్తే మీ జీవితాన్ని మీరు దాటినట్లే. దీని అసలు ఉద్దేశం ఏమిటంటే. మీ తర్కాన్ని వినాశనం చెయ్యడమే. అప్పుడు మీరు
మీ జీవితంలోని కొత్త విషయాలను తెలుసుకుంటారు

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...