ఊపిరి ఊయల గుండెతో లబ్ డబ్ అని...
పదేపదే పని ఒత్తిడిలో వేగంగా పలవరిస్తుంది....
పనిలో కలం నీ శివలింగమై కాగితం పానవట్టమై
అక్షరమక్షరం మంత్రమై స్మరించటం తప్ప ఏంచేయలేకపోతున్నా...
నన్ను మన్నించు తండ్రి....
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.
No comments:
Post a Comment