ఉన్నవారు శివాలయము కట్టగలరు...
గుడికి వెళ్లి ప్రత్యేక దర్శనం లో అభిషేకం చేయగలరు....
నేనేమి చేయగలను శివ కడు బీదవాడినయ్యా...
పని చేస్తే కానీ పుట గడవని కటిక దరిద్రుడిని...
నమక చమకం తెలియదు...
అష్టోత్తరాలు అస్సలే రాదు...
ఏమో నయ్య శివ గుండె నిండా నీవే ఉన్నావు...
ఏమివ్వగలనయ్య శివ నీకు...
నా శరీరమే నీకు దేవాలయం...
నా శిరస్సు నీకు శిఖరం...
నా హృదయం నీకు పీఠం...
నా కంటి చూపు నీకు దీపాలు...
నేను తినే గొడ్డుకారం అన్నమే నీకు పంచబక్ష పరమాన్న నైవేద్యం...
నా కంటి నుండి వచ్చే రూధిరమే నీకు గంగజాలం...
వినవయ్యా సాంబశివ నా మొర వినవయ్యా....
నీ స్థావరానిని నన్ను చేర్చుకోవయ్య లోకేశ్వరా...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment