Friday, April 2, 2021

శివోహం



*మనము చేసే - కర్మకు బాధ్యులు - ఎవరు???...*

ఈ విషయంలో మానవునికే కాదు, జగజ్జనని అయిన పార్వతీ దేవికి కూడా అనుమానం కలిగింది...

ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో... 
మానవులు కర్మలు చేస్తుంటారు కదా.. ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా?.. లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా అని అడిగారు... 

*అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారు...*

పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు, దేవుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే... కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. 
మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు, ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే...
ఇందులో దైవప్రమేయము ఏదీయు లేదు, పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు...

మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు...

"ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది, దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది."

నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. 
అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది, అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు...

_కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పక కావాలి, అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు..._

                        *శుభమస్తు*
    

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...