విధి అంటూ ఏదీ లేదు
మన జీవితం మన ప్రారబ్ద
మన కర్మల పర్యవసానమే !!
ఈ విధంగా మనమే మన కర్మలను
రూపొందించుకొంటున్నామంటే
వాటిని నశింపచేసుకోవడమూ
మనకు సాధ్యమే అన్నది నిజమే కదా ? "
గొంగళిపురుగు తన దేహంనుండి స్రవించే
పదార్థంతో తన చుట్టూ తానే గూడు
కట్టుకొని దాన్లో తానే బంధీ అవుతోంది
అక్కడే ఉంటూ అది
రోదించవచ్చు ఆక్రోశించవచ్చు
కాని దాని సహాయానికి
ఎవరూ రారు
చివరకు అదే జ్ఞానం పొంది అందమైన
సీతాకోక చిలుకలా బయటకు వస్తుంది
ప్రపంచిక బంధాలకు సంబంధించిన
మన పరిస్థితీ ఇదే .........
యుగయుగాలుగా మనమూ
జనన మరణ చక్రంలో తిరిగివస్తున్నాం
ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాం
మనం బందీగా ఉండడం గురించి
విలపిస్తూ దొర్లుతున్నాం
కాని ఏడ్వడం వలనా
వాపోవడం వలనా
ఏం ప్రయోజనం లేదు
ఈ బంధాలను చేధించడంలో
మనం అకుంఠిత ప్రయత్నం చేయాలి అన్ని బంధాలకు ముఖ్యకారణం - అజ్ఞానం
మనిషి స్వభావరీత్యా
దుష్టుడు కాడు ఏనాడు కాడు
అతడు స్వభావరీత్యా పవిత్రుడు
పూర్తిగా పావనమైన వాడు
No comments:
Post a Comment