*నమ్మకం - విశ్వాసాలకు - ఉన్న తేడా ఏమిటి???*
ఈరోజు చాలామంది నమ్మకం - విశ్వాసం ఏదయినా ఒక్కటే, తేడా ఏమీ అని భావిస్తారు, కానీ చాలా వ్యత్యాసం ఉంది, అదేమిటో ఒకసారి పరిశీలిద్దాం...
ఒకచోట ఎత్తయిన రెండు భవనాల మధ్య ఒక బలమైన తాడు కట్టబడి ఉంది, దాని మీద ఒక వ్యక్తి నడుస్తున్నాడు,
వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవసాగాడు.
చేతిలో ఒక పొడవయిన కర్ర పట్టుకున్నాడు, భుజాన అతని కొడుకు ఉన్నాడు, అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.... చాలా ఆతృతగా...
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు, అందరూ చప్పట్లు కొట్టారు, కేరింతలతో ఆహ్వానం పలికారు, ఫోటోలు వీడియోలు తీసుకున్నారు...
“నేను ఈసారి ఇదే తాడు మీద నుండి తిరిగి అవతలికి వెళ్లాలనుకుంటున్నాను వెళ్లగలనా?” అని అతను ప్రశ్నించాడు...
వెళ్లగలవు, వెళ్లగలవు! అని జనం సమాధానం పలికారు...
నా మీద నమ్మకం ఉందా మీకు అని మళ్ళీ ?
ఉంది...ఉంది, మేం పందానికి అయినా సిద్దం అన్నారు!!
అయితే మీలో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను అని అన్నాడు!!
అక్కడంతా నిశబ్దం, జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు! ఉలుకు లేదు, పలుకు లేదు!
*నమ్మకం వేరు, విశ్వాసం వేరు...*
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి...
ఈరోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇక్కడే...
దేవుడు అంటే నమ్మకమే, పూజలు, భజనలు, సేవలు, అన్ని తెగ చేస్తాము, కానీ ఆయనపై విశ్వాసం లేదు...
మరి ఆయన నిన్ను ఎలా కాపాడేది???,
ఈ జన్మనిచ్చిన భగవంతుని పైన్నే విశ్వాసం లేనప్పుడు ... ఆయన నీకు ఏమి చేయగలడు,
No comments:
Post a Comment