తీవ్ర వైరాగ్యం మోక్షానికి ప్రథమ కారణం
జ్ఞానం ఎలా వస్తుందంటే శ్రవణ, మనన, నిదిధ్యాసనాల ద్వారా వస్తుంది. ప్రాపంచిక విషయచింతన లేకుండా వైరాగ్యం సహాయం చేస్తుంది. మరి ఆత్మ చింతన ఎలా కలుగుతుందంటే ముందు దాని గురించి వినాలి. దాని గురుంచి వినకుండా దానిని చింతించలేవు కదా! దానిగురించి వింటే నీకు మననం చేయబుద్ధి పుడుతుంది. మననం చేయగా చేయగా నీకు దాని మీద ధ్యాస కలుగుతుంది. అప్పుడా ధ్యాసే ధ్యానం క్రింద మారిపోతుంది.
No comments:
Post a Comment