Monday, August 30, 2021

శివోహం

శంభో...
నా ఈ శరీరం అనే ఇంటికి యజమాని నీవు...
నాలో ఉంటూ నా మనుగడకు కారణం నీవు...
నీవే నాకు అత్యంత ఆప్తుడివి ఆత్మీయుడివి ఆత్మబంధువు కూడా...
జననం నుండి మరణం వరకూ నన్ను ఎటువంటి సుఖ దుఖ పరిస్తితి లో విడవకుండా నా దేహాన్ని అంటి పెట్టుకొని ఉన్న నా మనసే నీవు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శరీరం కంటే ఇంద్రియాలు...
ఇంద్రియాల కంటే మనస్సు...
మనస్సు కంటే బుద్ది...
బుద్ది కంటే ఆత్మ గొప్పది అన్న పరమ సత్యాన్ని తెలియజేసిన పరమాత్మ నీకు వందనాలు....

ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమః

Sunday, August 29, 2021

శ్రీ క్రిష్ణ అష్టమి శుభాకాంక్షలు

కృష్ణా...
నీ లీలలు మాయలు సుర ఇంద్రాదులు కూడా  ఎరుగలేరు...
ఇక నేనెంత వాడిని గోపాలకృష్ణ...
జగన్నాథ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక....
నీ అమేయ అప్రమేయ అద్వితీయ అమోఘ దివ్య ప్రభావం అలా అలా ప్రశాంతంగా లోక కళ్యాణ కరంగా, సకల జనుల ఉద్ధరణకు వ్యాపిస్తూ సకల ప్రాణికోటికి శ్రీరామరక్ష గా నీ గోవింద నామం నిలుస్తోంది...
హరి నీవే శరణు....

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం  భక్తి ప్రపంచం సబ్యులకు పెద్దలకు గురువులకు శ్రీ క్రిష్ణ అష్టమి శుభాకాంక్షలు

శివోహం

శంభో...
నీ కైలాసం లో నాకింత చోటును ప్రసాదించు స్వామి...
నా జీవితం ని సేవకే అంకితం చేస్తా...

మహాదేవా శంభో శరణు...

Saturday, August 28, 2021

శివోహం

శివా!మీరు ఇద్దరు ఒకటిగ అగుపిస్తే
నేను రెండును కలిపి ఒకటిగా అడిగేను
జ్ఞానవైరాగ్యములు ఒకటిగా ఒసగమని
మహేశా ..... శరణు.

అయ్యప్ప

నా జీవన పయనం నీ కోసం..
కాలం కరిగిపోయినా...
వయసు తరిగిపోయినా...
చూపు చిన్నబోయినా...
మాట మూగబోయినా...
ఆగను నీ శబరి యాత్ర నే ఆపను ...
నడుస్తూనె ఉంటా నిన్ను చేరేవరకు..
పిలుస్తూనె ఉంటా నువ్వు పలికేవరకు...

హరిహారపుత్ర శరణు...

శివోహం

శంభో...
నీ నామం మాకు శ్రీరామ రక్ష...
నీ భావం మాకు ఎనలేని సంపద...
నీ శ్రీశైల క్షేత్రం మాకు ఆనంద నిలయం...
నీవు లేకుండా మేము లేము...
నీ తలంపే మా బ్రతుకులకు మనుగడ...

మహాదేవా శంభో శరణు.

Friday, August 27, 2021

శివోహం

శంభో...
ఆకలి
నీ నియమాలను మాయచేసేస్తుంది...
ఆశ
కోరికల కోటలో గూడు కట్టుకుంది...

ఆ కోరికలే నన్ను నీకు నుండి దూరం చేస్తున్నాయి...

ఆపద్భాంధవా అనాధరక్షకా ఒకటే కోరిక తండ్రి నిన్ను చేరే వరకూ నన్ను నడిపి నీపాదాల చెంతకు చేర్చుకో...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఆది అంతు లేని  ప్రయాణం...
గమ్యం తెలియని  జీవనం...
ఈ జీవుడి అనంత మైన యాత్ర...
ఈ జీవాత్మ ,ఆ పరమాత్మ తో అనుసంధానం చెందేవరకూ ఈ జీవన యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో...
నీ నామం మాకు శ్రీరామ రక్ష...
తండ్రి నీవే శరణు...

Thursday, August 26, 2021

శివోహం

నా తనువంతా తన్మయత్వం తో నిండి పోయి ఉంది శివ...
ఇంతటి తన్మయత్వం నీ సేవలో తప్ప ఇంకెక్కడా దొరకదు....

మహాదేవా శంభో శరణు.

శివోహం

జీవునిలో దేవుడు కొలువై ఉండాలంటే...
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శరణాగతి చేయాలి ...
ఈశ్వర తత్వం చింతించాలి మదిలో హృది లో పరమేశ్వరుడిని నిలపాలి...
పాహిమాం ప్రభో రక్ష మాం అంటూ ఆత్మ నివేదన చేయాలి అనుగ్రహించమని కైలాస నాథుని వేసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

బుద్ధిమంతులు, భక్తులు, జ్ఞానులు, కష్టాలను ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు...
అది నేరుగా దైవానికి దగ్గర చేరుస్తుంది...
నిజానికి ఏ మనిషి కైన, ప్రాణ భయాన్ని మించిన భయం, లేదా కష్టం, బాధలు ఉండవు...
శంబుడి కృప తోడు ఉండగా, బాధ పడటం దండగ...
ఎందుకంటే ఆ శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడే కనుక...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మణికంఠ...
ముగ్ధమోహన నీ రూపాన్ని చూడనీకుండా దూరం చేయడం...
బ్రతుకు భారం చేయడం నీకు తగునా, తండ్రీ...
అసలు నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగల మని నీవు అనుకున్నావు...
నీ యేడు ఐనా నీ దర్శన భాగ్యం కలిగించు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

Wednesday, August 25, 2021

శివోహం

శంభో...
నిపై నీవు చూపిస్తున్న ఈ కరుణా మృత వర్షమున కు శతకోటి ప్రణామాలు...
ఒకటే కోరిక తండ్రి నీ పాద పద్మాలను తరుచూ సేవించుకునీ తరించే మధుర అనుభూతులను నాకు ప్రసాదించు...
ఇంతకన్నా ఆనందము ఉంటుందా ప్రాణేశ్వరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

హే శంభో...
హే జగదీశ్వర...
హే పరమేశ్వరా...
మేము అల్పులము...
అఙ్ఞానులము...
అవివేకులము...
అమాయకులం...
మూడు కన్నుల వాడివి నీవే సర్వం అని తెలిసి కూడా నీ మూడో కన్ను కప్పి చేయరాని తప్పులు చేస్తున్నామని నీ నుండి దూరం చేయకు...
నిన్ను మరవకుండా నీ చరణ కమలాలు విడవకుండా
నిన్ను సేవించి, తరించే మహా భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Tuesday, August 24, 2021

శివోహం

శివా!వేడి చూపున  కాల్చుతావో
వాడి చూపున కరుణిస్తావో...నీ ఇష్టం
ఏమైనా  నీవంటేనే నాకిష్టం
మహేశా . . . . . శరణు .

శివోహం

నా గమ్యం నీవు...
నాకున్న ఏకైక లక్ష్యం నిన్ను చేరుటయే...
నా పయనం నిన్నుచేరే వరకు నీ మీద ద్యాస తప్ప నాకు లేదు నా ప్రాణం మీద ఆశ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

భాహ్య విషయాలతో భగవంతుని అనుసందానం చేయకూడదు.వాటి అవసరాల కోసం భగవంతుని ప్రార్థించకూడదు. చెడుకు దూరంగా, మంచిలో బ్రతికేందుకు ప్రార్ధించాలి...

ఈ దేహమూ, ప్రాణమూ భగవంతునిదే కనుక ఈ జీవితాన్ని ఆయనకు ఇష్టం వచ్చిన రీతిగా మలచుకొమ్మని ప్రార్ధించాలి. మనకు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటూ పదిమంది మంచికొేసం ప్రార్ధించాలి.నిత్యమూ ఆయన సృహలొనే ఉండేలా చేయమని ప్రార్ధించాలి...

ప్రార్ధన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చకున్నా అది మన మనస్సును ప్రభావితం చేయగలదు. కనుక జీవితంలొే ప్రార్ధన అనేది ఒక బాగమైపోయేలా చూసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, August 23, 2021

శివోహం

అలసిపోతున్నాను శివా విశ్రాంతి ఈయవా ఈశ్వరా
ఒకడిని పంపి జతకలిపి ముగ్గురను చేసి బంధాల బరువులు పెంచి బాధ్యతల లోతులలో పడేసి
ఈదమంటే ఎలా శివా...

నిన్ను స్మరించే సమయమే ఈయవా...
నిత్యం నీ నామాలాపన చేసేది ఎలా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
అఖిల లోకములకు మూలం నీవే... 
సకల శాస్త్రముల సారమూ నీవే... 
అష్ట ఐశ్వర్యములకు అధిష్టానం నీవే... 
ఓ శంకరా ! దేవతా సార్వభౌమా... 
సర్వ శక్తి సంపన్నుడవు నీవు... 
నను కరుణించుట భారమా తండ్రీ... 
నీ దయకు నేను తగని వాడినా.... 

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఓ కన్నీటి బొట్టు జారినాక కానీ తెలియలేదు మహాదుఃఖం నన్నావహించిందని...
ఆ దుఃఖాన్ని నీ నామం అనే చిరునవ్వుతో బందించా...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

శివా!నాకేదో తెలుసుకోవాలని ఉంది
నీతో ఏదో చెప్పాలని ఉంది
సతమతమవుతున్నా, శరణమంటున్నా
మహేశా .  . . . . శరణు .

శివోహం

కట్టె కొనల కడ...
కడ చూపులేల శివా...
తనువు కాలిపోక ముందే...
నా కనులు తెరిపించు...
నిన్ను చూపించు...

మహాదేవా శంభో శరణు

శివోహం

జీవుడికి మరణం జననం లాంటివి ఉండవు...
పాత బట్టలు తొలగిస్తూ కొత్త బట్టలు ధరిస్తు
మరో జన్మ మరో తలిదండ్రులు మరో బంధనాలు
ఇలా మారుస్తూ వెళ్తూ ఉంటాడు...
ఆది అంతు లేని  ప్రయాణం
గమ్యం తెలియని జీవనం
ఈ జీవుడి అనంతమైన యాత్ర 
ఈ జీవాత్మ ఆ పరమాత్మ తో అనుసంధానం చెందేవరకూ ఈ జీవన యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందే ఎంత కాలమో కదా ఈ దేహ ధారణము

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!పంచ భూతాలుగా అంతటా ఉండి
పంచ ప్రాణాలుగా నాలోన నిండి
మెరుగైన వైలుగువై మెరిసిపోతున్నావు
మహేశా . . . . . శరణు

శివోహం

తేజో వంతులలో తేజస్సు బలం అందించి కాపాడు వాడవు...
సమస్త   భూతములు, సృష్టి అధీనములో ఉంచుకొన్న వాడవు...
ప్రకృతినీ అనుకరించి ప్రకాశింప చేసేవాడవు...
రామభక్త హనుమా నీవే శరణు...

Saturday, August 21, 2021

శివోహం

శంభో...
సాధారణ మానవుడిగా పాపాల కుపము అనే చికటి పొరలో చిక్కుబడిపోయాను...
నా మనసు అజ్ఞానం, అహంకారం కామా క్రోదాది ఆరుగురు మిత్రులతో స్నేహం చేస్తూ నన్ను  నీ నుండి దూరం చేస్తుంది...

జన్మనిచ్చిన తండ్రి నీవు నాకింత జ్ఞానం ఇచ్చి నీ దరికి చేర్చుకో శివా......

మహాదేవా శంభో శరణు.

Friday, August 20, 2021

శివోహం

శివా!దేహ భావన దగ్ధమవనీ
ఆత్మ భావన నిలిచిపోనీ
అంతటా నిన్ను చూడనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నిన్ను తప్ప అన్యుని తలవను...
నీవే శరణు నీదే రక్ష.

అమ్మ

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు, పెద్దలకు,గురువులకు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

ఓం శ్రీమాత్రే నామ.

శివోహం

ప్రమిదలో చమురైపోతుంది...
ఒత్తికూడా కాలిపోతుంది...
ఉన్నన్నాళ్లు తాము  ఆవిరైపోతు...
దీపంగా లోకానికి వెలుగునిస్తున్నట్టే...
మనం కూడా కొంతలో కొంతైనా పదిమందికి సహాయ పడేలా మన జీవిత గమనం సాగేలా చూసుకోవాలి...
అదే దీపం పరమార్థం....

*అనంతవచనం*

శివోహం

ఈ సృష్టికి మూలమైన శక్తి...

ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది...

మనస్సు శాంతిగా ఉండాలన్నా,
బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి...

అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి...

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే....

అమ్మ అనుగ్రహం ఉంటే వానికి లేనిదేమిలేదు...

ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీదుర్గదేవినే నమః

శివోహం

ముల్లోకానికి దిక్కు నీవు...
ఏ దిక్కులు లేని వాడిని నేను...
నీవు లోకాన్ని సృష్టించే వాడవు...
నేను నీ లోకంలో ఒక బిందువును...
నా లోని అణువణువు నివైనపుడు...
నా ఉఛ్వాస నిఛ్వాస నివైనపుడు....
నాకు దారి చూపే దైవం నివైనపుడు...
నా హ్రుదయ స్పందన నివైనపుడు...
నేను నువు కాకుండా పోతాన తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Thursday, August 19, 2021

శివోహం

శివా!జన్మ భాగ్యము జయము కాగా
మరణయాతన ముగిసిపోగా
జన్మ బంధము నుండి జారిపోనీ
మహేశా ..... శరణు

శివోహం

చలనము నీవే...
జ్వలనము నీవే...
చెరిగిపోయే ఆశకు ప్రాణము నీవే...
అభయ హస్తంతో నాలో సర్వం హరించే హరుడవు నీవే పరమేశ్వరా...
నీవే శరణు...నీదే రక్ష...

మహాదేవా శంభో శరణు.

Wednesday, August 18, 2021

శివోహం

శివా!మా వెనువెంటే నీవంటే
ఏమేమో అనుకున్నా
వెనుతిరిగి చూడ నాకు విస్మమయమే
మహేశా . . . . . శరణు .

శివోహం

ఉదయకాలపు బ్రహ్మవు...
మధ్యాహ్న రుద్రుడవు...
సాయంకాల నారాయణుడవు...
నీవే నా మదిలో మెదిలే దేవదేవుడవు...
సోమ,  సూర్య, అగ్నులు నేత్రాలుగా గలిగిన దేవా...
ఆతేజములే మాకు మూడు రూపాలుగా  అగుపించెను పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Tuesday, August 17, 2021

శివోహం

శివా!విశ్వ నేత్రము నీవే
జగతి ఛత్రము నీవే
ముక్తి సూత్రమూ నీవే....
మహేశా ..... శరణు..

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...