Sunday, August 1, 2021

శివోహం

నీ నిజస్థితే నీ జీవనప్రమాణం......

నీ నిజస్దితి గురించిన అవగాహన లేదా అవసరం నీకు ప్రాణావసరంగా ఉండాలి. 
అది తప్ప వేరు అవసరం నీకు ఉండకూడదు. 
అది ఎంత బలమైనదిగా ఉండాలంటే దానికి సమానమైనది మరేదీ ఉండకూడదు. 
అత్యంత విలువైనదిగా ఉండాలి.  నీనిజస్థితే నీజీవనప్రమాణంగా  అత్యుత్తమమైనదిగా నీకు అవసరం పడాలి. 
 
దానికోసం ప్రతీ లిప్తనూ, ప్రతీ క్రియనూ అంతఃకరణమునకు నివేదన చేస్తుండు. 
 
సర్వశక్తులనూ, ఇతరమైన చేష్టలనూ అంతఃకరణమునకు నివేదన చేస్తుండు. 
అనంతమైన అవగాహనతో , శ్రద్దతో , విధేయతతో , సమర్దతనంతటినీ అంతఃకరణమునకు నివేదన చేస్తుండు . 
 
నీకు (దేహమునకు) నీవే  కాస్త ఎడంగా ఉంటుండు . 
 
నీవు అత్యంతసమర్దతతో అంతఃకరణమునకు వసమౌతుంటే నీలో  దేహభావన సడలిపోతుంది. 
 
దీనిగురించి మాటలతో, చేష్టలతో, విశ్లేషణలతో, సమయాన్నీ వృధా చేసుకోవద్దు.  నీనిజమైన సంపద అంతా లోదృష్టిలోనే ఉంది . 
 
"నాకు లోదృష్టి అలవడటం లేదు అనేది నీకు దానిపై ఉన్న అశ్రద్ద మాత్రమే". 
 నాకు కుదరడం లేదు అనేది కూడా          ఒకరకమైన అపనమ్మకమే. 
 
నీకు నీవు సదా చేరువయ్యే ఉన్నావు. 
 నీకు నీవు ఎప్పుడు ఎడం కానే కాదు . 
  
స్వయమును ఇతరముగా అనుభవించడం మానేయ్యి .  
 
"ఉన్నది" ఏదైతే ఉన్నదో అది చేరువగానే, 
సరళంగానే ఉన్నది .  
లే అంతఃర్ముఖుడవు కమ్ము  
నీవు నీగురించిన అనుభవపు ఆవరణలోనికి పోయి 
నీలోవున్న నిశ్శబ్దంలోనికి తొంగిచూడు. 
వస్తుజాలం లేశమైనా లేని అనంత సౌధంలోనికి పో,  అక్కడ  
నీ విషయజ్ఞానం, పరాయితనమంతా భగ్గున కాలి బూడిదౌతుంది. 
 
తుదకు నీలో నేను (అనే దేహభావన)అనే  శేషమంతా హరించబడుతుంది. 

                           శ్రీరమణస్వామి.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...