Saturday, September 25, 2021

శివోహం

శివా! విశ్వముతో బంధము  వీడనీయి
విశ్వాత్మతో   ముడి పడనీయి
ఈ నేను మేనుల పోరు ముగియనీయి
మహేశా ..... శరణు.


శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతమును మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .


 శివా! నీటితో నీ బంధము చెప్పలేనిది
ఒకనాటితో ఆ బంధం తీరిపోనిది
పన్నీరు కన్నీరు నీకు అభిషేకమే
మహేశా ..... శరణు

శివా!అక్షరాలు లేని భాష అలవరచు కున్నాను
లక్షణాలు నీ చెంత నేర్చుకున్నాను
మత్సరాలు లేని జన్మ  కోరుకున్నాను
మహేశా . . . . . శరణు .

 శివా!నీ సిగ శిఖరం అయ్యింది 
అది గంగకు వాసం అయింది
గగన కుసుమానికి ఆవాసమయ్యింది
మహేశా . . . .  . శరణు .


శివా! గంగమ్మ కొసగేవు కమ్మదనం
చంద్రుని కొసగేవు చల్లదనం
నాకీయవయ్యా జ్ఞాన ధనం
మహేశా...శరణు....


 శివా! నిన్ను అంటి పెట్టుకున్నవారికి శుభయోగం
నువ్వు కంట పెట్టుకున్నవారికి  ఘన తేజం
గుండెలో పెట్టుకున్న నాకు ఏమిటి భరణం .
మహేశా . . . . . శరణు

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...