శివా! గంగమ్మ కొసగేవు కమ్మదనం
చంద్రుని కొసగేవు చల్లదనం
నాకీయవయ్యా జ్ఞాన ధనం
మహేశా...శరణు....
శివా! నిన్ను అంటి పెట్టుకున్నవారికి శుభయోగం
నువ్వు కంట పెట్టుకున్నవారికి ఘన తేజం
గుండెలో పెట్టుకున్న నాకు ఏమిటి భరణం .
మహేశా . . . . . శరణు
శివా! ఎదురు చూపుకు ఎదురు కావు
ఎదను చూపులు నాకు రావు
ఎదుటపడుట ఎలా ? ఎఱుక చేయవేల.?
మహేశా ..... శరణు.
కర్మ బంధము కాలి పోవును
మన బంధమే శాశ్వతము
మహేశా.....శరణు.
No comments:
Post a Comment