[9/18, 7:38 PM] Srirangam Jogi FB: శివా!ద్వంద గుణములు దాటలేకున్నాను
ఆద్వైతమును మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .
శివా! నీటితో నీ బంధము చెప్పలేనిది
ఒకనాటితో ఆ బంధం తీరిపోనిది
పన్నీరు కన్నీరు నీకు అభిషేకమే
మహేశా ..... శరణు
లక్షణాలు నీ చెంత నేర్చుకున్నాను
మత్సరాలు లేని జన్మ కోరుకున్నాను
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment