శివా!యోచితంగా ,అనాలోచితంగా
ఏదైనా నా ఆలోచనలన్నీ నిన్నే చుట్టనీ
విడువకుండా నీ చేయి నన్ను పట్టనీ.
మహేశా ..... శరణు.
శివా!గణపతి ధళపతి నీ సుతులే
నాభి బంధము లేకే నడయాడ వచ్చారు
అట్టి వాడనే కదా తెలియ నేను
మహేశా . . . . . శరణు .
పశు భావన నాలో తొలగలేదు
భావోన్నతి కల్పించు భవ శరణం అందించు
మహేశా . . . . . శరణు.
No comments:
Post a Comment