శివా!నీవు నామ రూపాలకు అతీతం
నేను నామ రూపాలకు పరిమితం
నన్ను కరుణించు నా పరిమితి పెంచు
మహేశా ..... శరణు.
శివా!గుర్తు తెలియని గమ్యం చేరేదెప్పుడో ?
జనన మరణ భ్రమణం ఆగేదెప్పుడో ?
తెలిసేదెలా ?......కథ ముగిసేదెలా .......?
మహేశా. ..... శరణు.
శివా! ఈ బ్రతుకు బండికి......
ఎద్దు ఎనుబోతుల జోడీ ఏమిటయ్యా
ఏదో ఒకదానిని కూర్చవయా
మహేశా......శరణు.
శివా!నీ ద్వారానికి నేను తోరణమైతే
అదే నాకు ఆభరణం
ఈ జన్మకు భరణం
మహేశా . . . . . శరణు .
మౌనం మసకేయ ,మాట ముందుకొచ్చింది
మనసు దిగులుగా ముడుచుకుంది మన్నించు
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment