Wednesday, October 6, 2021

శివోహం

శివా!చెట్టు కింద స్వామి గుట్టు విప్పవేమి
మౌనమైన బోధలో వున్న మర్మమేమి
ఆత్మబోధ అందువా పరమాత్మ బోధ అందువా
మహేశా . . . . . శరణు


 శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతము మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .


 శివా!నీనుండి విడివడి నేను
విశ్వమంతా తిరుగుతున్నా
నీ ఒడిని చేరగ వెతుకుతున్నా
మహేశా . . . . . శరణు .


శివా!ఏకోన్మఖముగ ఎదగాలి
ఏకాక్షితొ నిన్ను చూడాలి
అందుకు నేనేంచెయ్యాలి
మహేశా . . . . . శరణు .


శివా! చిత్తంలో చిరు జ్యోతివి
బాహ్యంలో బ్రహ్మాండ తేజానివి
అంతటా ఉన్నావు అగుపించకున్నావు
మహేశా ..... శరణు.


శివా!మా ఆలోచనల నిండా నీవు
మా లోచనముల నిండా నీవు
ఏ చలనము లేకుండా అమరివున్నావు .
మహేశా . . . . . శరణు .


శివా!మునుపెరుగనవి ఎన్నెన్నో మౌనంలో తెలిసాయి
తెలిసాక మౌనం పై పెరిగింది మోహం
మౌనం పెరగనీ మోహం తరగనీ
మహేశా . . . . . శరణు .


 శివా!నీవు నామ రూపాలకు అతీతం 
నేను నామ రూపాలకు పరిమితం
నన్ను కరుణించు నా పరిమితి పెంచు 
మహేశా ..... శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...