అమ్మ నీవైనా చెప్పారాదా...
శివపార్వతులు ఒకటే అంటారు కదా...
నీవు చెబితేనే గాని నీ శివుడు దయ చూపడు అంటారు గదా...
ఇది నిజమే అయితే శివుడి కరుణ ను నాపై కొంచెం వర్షించమని చెప్పుతల్లి...
ఈ దీనునిపై దయజూడమని నీ (నా) ప్రాణనాధుడి దివ్యదర్శనం కోసం అలమటిస్తున్న ఈ పేదవాడికి , నీవైనా దారి చూపలేవా...
ఒక్కసారి నా మొరను వినమని నీవైనా చెప్పరాదా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా...
No comments:
Post a Comment