Tuesday, November 9, 2021

శివోహం

 శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .


 శివా!నీ గుడిలో దీపంగా నన్ను వెలగనీ
నా గుండెల్లో దీపంగా నిన్ను తెలియనీ 
ఆ వెలుగు బాటలో నే గమ్యం చేరనీ
మహేశా .....శరణు.


 శివా!ఈ జీవిని నీ ముందు నిలిపినా
పశువునని ఏ మందను కలిపినా
అది నా భవరోగానికి మందే
మహేశా . . . . . శరణు .

శివా!అసమానతలన్ని ఆవిరైపోగా
భేదములన్ని బూడిదైపోగా
చేర వచ్చేవా నన్ను నీలో చేర్చుకొనగ
మహేశా . . . . . శరణు .


శివా!గుడిలోన నిన్ను చూసి
గుండెలో చూడాలని తపిస్తున్నా
తపన తెలిసిన నీవు తెలియరావా
మహేశా . . . . . శరణు


 శివా!విలాసమెరుగని నీ విలాసము
ఈ విశ్వమెరిగిన ఆ కైలాసము
అది తెలిసిన ,తలచిన ప్రమోదము
మహేశా . . . . . శరణు .


 శివా!నీ దండయాత్ర దండించడానికా
దరి చేర్చుకోవడానికా దేనికైనా
అగ్ని కన్ను చాలు ఆయుధమేల
మహేశా . . . . . శరణు .


 శివా!నమః శివాయ నమః శివాయ అంటున్నా
నకార మకార మమకారం తొలగించమంటున్నా
తొలగించవయ్యా నన్ను కరుణించవయ్యా
మహేశా   . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...