దేహి దైవాన్ని నిత్యం దర్శించాలి
స్పృశించాలి సేవించాలి సంభాషించాలి
సాష్టాంగ పడాలి సమాధన పడాలి
తన వేదనను రోదనను వాదనను
అర్తిని అర్థ్రతను స్వామి ముందుంచాలి
సాయంకోరాలి అహంకారం వీడాలి
సంస్కారం పరిమళించాలి
ఆశలను తిరస్కరించాలి
సహకారాన్ని స్వీకరించాలి
ఓంకారంతో నమస్కారం సమన్వయపడాలి
ప్రియంగా మాట్లాడాలి హితంగా పలుకరించాలి
మనచేతలు పరహితంకావాలి
మన స్వార్థం మరొకరికి అపకారం కారాదు
ఉపచారాలు ఉపకారాలు
తుష్టిని పుష్టిని కల్పిస్తాయి
సాత్త్వికతం అనుసరించినవారికి
ఉద్వేగాలు ఉద్రేకాలు అంతరిస్తాయి
మనసులు ప్రసన్నమవుతాయి
అప్పుడే మనలోని భక్తి భావనకు అర్థం ఉంటుంది
బ్రతుకు పరమార్థం సార్థకమవుతుంది...
No comments:
Post a Comment