Tuesday, January 4, 2022

శివోహం

 శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .


 శివా! కనిపించగ వీలుపడదంటావు
అనిపించటం నీ పనికాదంటావు 
మరి నాకు ఎలా తెలియ వస్తావు
మహేశా ..... శరణు.


 శివా!నీవైన విశ్వాన్ని ఈ కనుల చూస్తున్నా
విశ్వమైన నిన్ను చూడలేక పోతున్నా
చూపునీయవయ్యా...చూడనీయవయ్యా
మహేశా . . . . . శరణు .


 శివా!ఋబు గీతను విన్నాను
ఋజు మార్గము గన్నాను
ఋషిగా నన్ను మలచు కొన్నాను
మహేశా . . . . . శరణు .


శివా!ఒంటిగా నను పంపి వెంట నీవన్నావు
సత్య ధర్మముల వెంట సాగిపోమన్నావు 
తెలియలేదంటె శోధించమన్నావు
మహేశా ..... శరణు.


 శివా!ఈర్ష్యా ద్వేషాలు ఎదగనీకు
కామ క్రోధాలు  రగలనీకు
మధ మాత్సర్యాలు  సోకనీకు
మహేశా .... శరణు.



శివా!ఆగలేక సాగుతున్న కాలం
సాగ లేక ఆగివున్న నీకు వశము
కాదనగ ఎవరి వశము
మహేశా . . . . . శరణు.


శివా!గత జన్మ గురుతు రాదు
మరు జన్మ తెలియ రాదు
ఏమిటో ఈ జన్మ యాతన .
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...