Wednesday, February 9, 2022

శివోహం

 శివా!పరమాత్మ జీవాత్మ సంకేతము
సూక్ష్మ శ్రేష్ఠముల నీవె శోభాయమానము
ఆత్మ జ్ఞానము తెలుపు ఒక పాఠము
మహేశా . . . . . శరణు .

 శివా!బ్రతుకు ఏమిటో తెలిసేది 
బ్రతుకేమిటో తెలిపేది 
ఈ జ్ఞాన వాకిటే....
మహేశా . . . . . . శరణు



 శివా!జన్మకు మరణం వరం
పుర్రెకు మరుపు వరం
నాకు నీ స్మరణ వరం
మహేశా.....శరణు.



శివా!ఎన్నేన్నో రూపాలు అన్నీ నీ ప్రతిరూపాలు          ప్రతి రూపం ప్రత్యేకం ప్రభవించగ నీ తేజం      
ఆ తేజం అనంతం అది నీకు సొంతం                
మహేశా . . . . . శరణు.



శివా! ఏది ఒకటి ఏదో ఒకటి
స్ఫురింప చేయి ... సర్వదా
నిన్ను తలిచేలా నిన్ను తెలిసేలా
మహేశా. . . . .శరణు..


శివా!బరువైన ఈ తలను తొలగించవయ్యా  
నీ తల వాకిట ఆ తలను తగిలించవయ్యా 
తల కలిగినందరూ తెలుసుకొనంగ. 
మహేశా . . . . . శరణు.



 శివా!మంగళ కారకా ఓ లింగమూర్తి
ఎంగిలి కాని రీతి నిన్ను ఎలుగెత్తి పిలిచాను
ఎఱుక రావయ్యా కినుక చాలయ్యా 
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...