Friday, February 25, 2022

శివోహం

నిన్ను నమ్మితే చాలు
గాజు ముక్కలోనూ ఉంటావు
మహాశివా
నిను కొలవాలే గాని
సర్వత్రా నీవే కొలువై ఉంటావు

సదా శివా
నీవు లేనిది ఎక్కడ
గాలి లోనూ నీటిలోనూ
నిప్పులోనూ నింగిలోనూ
అంతటా నీవే నిలచి ఉన్నావు

జగదీశుడవు 
ఆది దేవుడవు
ధర్మార్మ కాల స్వరూపుడవు
నిను పూజించని కరములా ఇవి
కాల సర్పంలా విషం చిమ్మునవి

నిను నమ్మిన వారికి
ఆపన్న హస్తాలు
అభయంకరా శంభో శంకరా
నిను చేర మార్గముపదేశింపరా
హరా పరమేశ్వరా

భద్రుడవు నీవే
రుద్రుడవు నీవే
మంగళాకారుడవూ నీవే
చిదానంద స్వరూపమూ నీదే
అన్నీ తెలిసీ మా పై ఈ పరీక్షలేల

త్రయంబకుడవూ నీవే
అర్దనారీశ్వరుడవూ నీవే
సదా నిర్వికారుడవూ నీవే
భోళా శంకరుడవూ నీవే
కాలుడవు నీవే మహా కాలుడవూ నీవే

సర్వేశ్వరా అంతటా 
నీవే నిండి ఉన్నావు
నిరాకారా నిర్విఘ్నకారకుడివి
సదా నిన్నే స్మరింతు
శ్రీశైల వాసా శ్రీ మల్లిఖార్జునా..!

     

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...