Friday, February 4, 2022

శివోహం

 శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .


 శివా!నీవు ఒక్కడివే అందరిలో ఉన్నావు                  అందరిలో ఒకడిగా  నేను ఉన్నాను                      కొందరిలో ఒకడిగా నన్ను ఎఱిగించు
 మహేశా ..... శరణు

 శివా!అంతరాయములు తొలగించు
అంతరాన నాకు అగుపించు
నన్ను నన్నుగా ఎఱిగించు.
మహేశా . . . . . శరణు .



 శివా!సోహం అంటున్నా శ్వాసతో
పాహీ అంటున్నా ప్రణతులతో
దేహీ అంటున్నా దేహంతో
మహేశా . . . . . శరణు


శివా!వేరుచేసి చూపేవు విశ్వ ధర్మం
కలుపుకొని చూపేవు కాల ధర్మం
వరేణ్య శరణ్య ఇది భక్తి ధర్మం
మహేశా . . . . . శరణు .


 శివా!మధగజ మైనది నా మనసు
మావటి నీవని మరి  తెలుసు
అంకుశాన్ని చూపు నిరంకుశత్వం మాపు
మహేశా . . . . . శరణు.


 శివా!సోహం స్వరమే నీకు జోల పాట
నమక చమకములే నీకు లాల పాట
మంత్ర మననమే నీకు ఏకాంత సేవ
మహేశా . . . . . శరణు .


 శివా!పరమాత్మ జీవాత్మ సంకేతము
సూక్ష్మ శ్రేష్ఠముల నీవె శోభాయమానము
ఆత్మ జ్ఞానము తెలుపు ఒక పాఠము
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...