శివా!నీ నీడలో నాకు విద్య నీయి
అవిద్య అన్నది తొలగనీయి
మిధ్య ఏదో తెలియనీయి
మహేశా . . . . . శరణు .
శివా!కనిపించే కన్నులు మూసి ఉంచనీయి.
కనిపించని కన్ను తెరిచి చూడనీయి
నీవు , నేను , తెలియ నీయి
మహేశా . . . . . శరణు
శివా!ఒక రూపమంటూ లేని నీవు
ప్రతి రూపంలో నీవే వెలుగుతు ఉంటే
నీ ప్రతిరూపం నేను కానా...?
మహేశా . . . . . శరణు .
శివా!నిప్పు కంట నన్ను చూడు చల్లగా
భక్తి జ్ఞాన కుసుమం విచ్చగా
అందున్న పరిమళాలు విరియగా
మహేశా. . . . . శరణు.
శివా!ఈ బ్రతుకు బండి పయనంలో
సాయమూ నీవే సాక్షమూ నీవే
శోధించి సాదించగ నా లక్ష్యమూ నీవే
మహేశా . . . . . శరణు
శివా!కైలాసం చేరడం
నా కామ్యము కాదు
అది నా గమ్యం
మహేశా . . . . . శరణు .
దేహాన్ని దహియించు జ్వాలగ రగలేవు
రెండూ ఒకటి చేసి ప్రణవాన మెరిసేవు
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment