ఈశ్వరుడు భక్తుడిని అనుగ్రహించడానికి భక్తుని యెడల ప్రత్యేకంగా అభిమానంగాని, ద్వేషంగాని ఉండవు.
ఈశ్వరునికి పక్షపాత బుద్ధి ఉంటే ఆయనను ఈశ్వరుడని ఎందుకంటాం ? భక్తులు మాత్రం దైన్య స్థితిని బట్టి గాని, ప్రీతిని బట్టిని గాని ఈశ్వరుని మీద అటువంటి పక్షపాతాన్ని ఆరోపిస్తూ ఉంటారు.
నిజానికి భగవదనుగ్రహం సదా సర్వత్రా సహజంగానే ఉంటుంది. ఆ అనుగ్రహాన్ని పొందడానికి భక్తుడు తనలోనే ఉన్న అహంకారాదుల అడ్డు తొలగించు కుంటే భగవదనుగ్రహానికి పాత్రుడవుతాడు. అడ్డు తెరలను తొలగించుకుంటే ఈశ్వరానుగ్రహం సహజంగానే లభిస్తుంది.
మానవ అనుగ్రహం కావాలంటే చేయవలసిన పనులు మనకు తెలుసు. అటువంటివన్నీ అహంకారాదులతో, స్వార్థంతో కూడుకొని ఉంటాయి.
ఈశ్వరానుగ్రహానికి ఏమీ చేయనవసరం లేదు. భక్తులందరికీ ఒకే ఒక్క నియమం. అదేమంటే వారి వారి అహంకార మమ కారాలను వదలాలి.
వస్తువుల మీద, విషయాల మీద ఆసక్తిని వదలి, సర్వమూ ఈశ్వరమయంగా చూడగలిగిన భక్తిని కలిగి ఉండటమే వారి అర్హత.
అహము, ఆత్మాభిమానమ్ము లణగియున్న
No comments:
Post a Comment