Wednesday, August 31, 2022

శివోహం

పార్వతి నందన పన్నగ భూషణ...
హర హర నందన శ్రీ గణేశా...
మూల ధారా వినాయక శరణు.

ఓం గం గణపతియే నమః.

శివోహం

అణువు అణువున వెలసిన నీవు
మాకు అగుపించేది ప్రకృతిలో
ఆ ప్రకృతి పరవశములోనే మాకు
వినిపించేది నీ ప్రణవనాదమే
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహదేవా శంభో శరణు.

శివోహం

అణువు అణువున వెలసిన నీవు
మాకు అగుపించేది ప్రకృతిలో
ఆ ప్రకృతి పరవశములోనే మాకు
వినిపించేది నీ ప్రణవనాదమే
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహదేవా శంభో శరణు.

శివోహం

విశ్వాసం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది మిత్రమా...

నీకు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని నీతోనే ఉంచుకో...

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, August 30, 2022

శివోహం

సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ అయ్యా గణపయ్య
స్వాగతం 
సుస్వాగతం...

శివోహం

జన్మలలో దారి తప్పిన మనస్సు
తెలియక చేసిన పాపాలు ఎన్నో
గాడి తప్పిన మతిని అనుసరించి
మనిషి చేసిన నేరాలు ఎన్నో

అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను 
ఎవరి తల అయినా 
ఎంత కాలం మోస్తుంది  
దూరాలు దుర్భరాలు 
కాకుండా ఉండాలి అంటే
భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు
ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్క డున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని
ఎలుగెత్తి పిలుస్తున్నాము

Monday, August 29, 2022

శివోహం

శంభో...
లబ్ డబ్ ధ్వనితో  మొదలైన నా శబ్ద ప్రపంచం...
నీ చెంత నిశ్శబ్దంలో ముగుస్తుంది...
నడుమ ధ్వనులలో ఓం నమఃశివాయ శబ్దం మారుమోగేలా దీవించు పరమేశ్వరా...

మహదేవా శంభో శరణు.

శివోహం

లౌకికం...
ఆధ్యాత్మికం...
రెండూ "తన" ప్రతిబింబమే...
తానే రాధ, తానే కృష్ణుడు...
తానే సత్యం, తానే కేంద్రం.

రాధేక్రిష్ణ రాధే రాధే.

శివోహం

శంభో...
నా దృష్టి మరల్చి ...
నిను మరచి...
నేనుండలేను...
ఉంటే నీతోనే నీలోనే...

మహదేవా శంభో శరణు.

Sunday, August 28, 2022

శివోహం

నీఇంట, నీవెంట, నీసందిట

నేనున్నప్పుడు,

అసంకిల్పితంగా ఎప్పుడైనా

ఎదురాడినానా ప్రభూ?


నీచెంత ఏచింత లేకుండా ఉంటూ

అనాలోచితంగా నోరుజారి

కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?


నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను

నా కలవరింతలలో నిన్ను కలతపరచే

కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?


నీకోసం సాగిన నా వెతుకులాటలో

నా సరసన నిన్ను గానక నిరసనతో

ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?


నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ

నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను

కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?


తెలియక, తెలివిలేక, తొందరతనంతో

నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?

మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?

నీకు దూరంగా అరవై వత్సరాల శిక్ష భరించాను

కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?

అయిందా? నన్ను చేర్చుకో ..

లేదా ... నాతో ఉండు!


మహాదేవా శంభో శరణు. 

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

సర్వేశ్వరా...... 
సర్వాంతర్యామి...... 
సర్వ జగద్రక్షకా..... 
సర్వ జగన్నాధా..... 

శివోహం....శివోహం.....

Saturday, August 27, 2022

శివోహం

అగ్ర పూజలు అందుకొనే అగ్రనాయక...
అఖిల గణాలకు నాయకుడా...
అఖిల జగములు నిన్నే పూజింప
మూషిక వాహనుడు నీవైతివి
కోరినవారికి వరాలిచ్చే శివుడు నీ కోసం మమ్ములను మరిచాడు...
నీవైన కరుణించవా కైలాసవాస తనయా.

ఓం గం గణపతియే నమః.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై మము రక్షించు..

శరణు శరణు శరణం మురుగా... 
శరణం శ్రీ బాలమురుగా..

శివోహం

శంభో నువ్వు కానిది ఏది..
నువ్వు లేనిది ఏది...
సర్వాంతర్యామి నువ్వు...
సర్వం సృష్టించినవాడవు...
కడు కష్ట మయినా, కడు దారిద్ర్యం అయినా నీ కన్ను పడితే కనుమరుగు కావాల్సిందే...
నీ కరుణ కోసం ఆరాట పడుతున్నాను.
సర్వ కాలమందు నా తోడుండగలవని ఆశిస్తున్నాను.

మహదేవా శంభో శరణు.

Friday, August 26, 2022

శివోహం

కంటినుండి ఎవడు చూచునో...
కన్ను ఎవరిని చూడలేదో...
చెవినుండి ఎవడు వినునో..
చెవి ఎవరిని వినలేదో...
మనస్సు నుండి ఎవడూహించునో...
మనస్సు ఎవనిని గూర్చి ఊహింపలేదో...
అతడే భగవంతుడు అతడే శివుడు...

ఓం శివోహం...సర్వం శివమయం.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

జీవునిలో దేవుడు కొలువై ఉండాలంటే...
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శరణాగతి చేయాలి ...
ఈశ్వర తత్వం చింతించాలి మదిలో హృది లో పరమేశ్వరుడిని నిలపాలి...
ఎందుకంటే సర్వదుఃఖాలనూ...
సర్వ పాపాలనూ అన్ని బాధలనూ తొలగించేది శివ నామస్మరణొక్కటే కనుక..
మదినే దేవాలయం గా చేసి శివుణ్ణి ప్రతిష్టించి ఇక ఏ చింతా చేరదుకదటయ్యా...
పాహిమాం ప్రభో రక్ష మాం అంటూ ఆత్మ నివేదన చేయాలి అనుగ్రహించమని కైలాస నాథుని వేసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, August 25, 2022

శివోహం

జీవితం ఓ యుద్ధరంగం పోరాడి గెలవాలి...
నీ ప్రయత్నం అపనంత వరకు నువ్వు ఒడిపోనట్టే లెక్క...

ఓం నమః శివాయ.

శివోహం

శివ...
లోక కళ్యాణం కొరకు నీవు గరళాన్నే మింగావు...
నాపాప క్షయానికి ఈమాత్రం బాధలు పడలేనా ఏంటి...
నాబాధలను నీనామ ప్రవాహం అదుపు చేయదా ఏంటి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నా నీ అనే నామరూప బేధాలే నిన్ను నన్ను  దూరం చేస్తున్నాయి...
వాటిని వదిలేస్తే  కడతేరే  మార్గం దొరుకుతుంది...
నేను చెప్పితి  నిజముగాను...
నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్ము...

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, August 24, 2022

శివోహం

జ్ఞానం, అజ్ఞానం - రెండింటికీ అతీతుడవు అయిపో...
అప్పుడు మాత్రమే భగవంతుని తెలుసుకోగలవు... నానా విషయాలను తెలుసుకోవడం అజ్ఞానం...
సర్వభూతాలలోనూ ఉన్నది ఒకే భగవంతుడే అన్న నిశ్చయాత్మక బుద్ధియే జ్ఞానం...
భగవంతుని విశేషంగా తెలుసుకొంటే అది విజ్ఞానం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

పాపం చేత కళంకితమైన ఈ లోకంలో....
పుణ్యాన్ని పండించగల కరుణాసముద్రుడవు నీవు...
అంతులేని స్వార్థం...
అవధుల్లేని అహంతో...
నీ ముందు మోకారిల్లుతున్న...
జ్ఞానభిక్షను ప్రసాదించు నాన్న...

మహాదేవా శరణు శరణు...

Tuesday, August 23, 2022

శివోహం

భాహ్య విషయాలతో భగవంతుని అనుసందానం చేయకూడదు.వాటి అవసరాల కోసం భగవంతుని ప్రార్థించకూడదు. చెడుకు దూరంగా, మంచిలో బ్రతికేందుకు ప్రార్ధించాలి...

ఈ దేహమూ, ప్రాణమూ భగవంతునిదే కనుక ఈ జీవితాన్ని ఆయనకు ఇష్టం వచ్చిన రీతిగా మలచుకొమ్మని ప్రార్ధించాలి. మనకు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటూ పదిమంది మంచికొేసం ప్రార్ధించాలి.నిత్యమూ ఆయన సృహలొనే ఉండేలా చేయమని ప్రార్ధించాలి...

ప్రార్ధన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చకున్నా అది మన మనస్సును ప్రభావితం చేయగలదు. కనుక జీవితంలొే ప్రార్ధన అనేది ఒక బాగమైపోయేలా చూసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నేను అనే అహం ను తీసి చూడు 

అన్నింటా నిండి ఉన్న పరబ్రమ్మ స్వరూపాన్ని గాంచగలవు

Monday, August 22, 2022

శివోహం

శంభో
అందరికీ దూరంగా...
సుదూరంగా...
స్వేచ్చా విహంగంలా...
ఆకాశమే హద్దుగా...
నాకునేనుగా విహరించేలానైనా శక్తినివ్వు!!
కాని పక్షంలో..
హాయిగా నీ ఒడినిచేరుకునేలానైనా నాకు వరమివ్వు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఏ నేను లేకపోతె శరీరము శవం అయ్యిందో ఆ శివం నేను...
నేను అపరిమిత నేనును...
నేను అచ్చుతుడను...
నేను ఆనంతుడను...
నేను అవ్యవయుడను...
నేను అజన్ముడను...
నేను ఆయోనిజడను...
అంతా నేనే, అన్నిటా నేను...
నేను లేనిది ఏదీ లేదు...
శివోహం... సర్వం శివమయం.

Sunday, August 21, 2022

శివోహం

భగవన్నామం పవిత్రమైనది
పాపాన్ని సమూలంగా ప్రక్షాళనం చేస్తుంది
నామాన్ని ఎప్పుడైనా చేయవచ్చు
ఎక్కడైనా చెయ్యవచ్చు
ఎవ్వరైనాచెయ్యవచ్చు
నామసాధన సులభ మైనది
నిరపాయ మైనది మధుర మైనది
మరపు రానిది అందుకనే 
సకల సాధనలలో నామానికి
అగ్రతాంబూలం అందింది
నామంలో నామి వైభవము
స్తుతియే ప్రధానంగా ఉండటం చేత
నామసాధన అధిక్య మని చెప్పబడింది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ప్రాతఃకాలములో ఎవరైతే  రెండు చేతులూ దోయిలించి శివ నామాన్ని స్తుతిస్తారో

ఎవరైతే చిత్తశుద్ధితో పరమేశ్వరుని ఆరాధిస్తారో వాళ్ళకు దుర్లభమైనది లేదు..
ఓం నమః శివాయ అంటే చాలు భవభయబాధలు అణిగిపోతాయి...
పసిడివన్నెలతో మిసమిసలాడే పరమశివుడి అనుగ్రహం పాలకుర్తి పరమేశ్వరుడి కటాక్షమే కదా మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప నిన్ను నమస్కరించు వారి
ఆపదలను పోగొట్టి రక్షించు...

శబరిగిరివాస పంచగిరి నివాస మణికంఠ దేవా నేను ఎల్లప్పుడూ నిన్నే స్తుతించుచుందును ఏ ఆపద వచ్చిన నా రక్షా నీదే తండ్రి....

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

Saturday, August 20, 2022

శివోహం

శివ నామం ను వినగానే ఆనందాశ్రువులు స్రవించనంత వరకే భక్తి సాధనలు అవసరం...

ఆ పరమేశ్వరుడి నామం విన్నంత వినగానే ఎవరికి కైతే ఆనందబాష్పాలు వెల్లివిరియునో,ఎవరి హృదయం ఉప్పొంగుతుందో అతడికి ఇక సాధనలు అనవసరం. 

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...