Sunday, September 4, 2022

శివోహం

నీ కృపా
కటాక్ష వీక్షణ
దయా భిక్ష ఆశీర్వాదాలతో ...

భుజించే ముందు 
కొన్ని మెతుకులు
ముందుగా సమర్పించడం
నీకు నైవేద్యమే కదా తండ్రీ ...

నిదురపోయే ముందు
నిన్నే తలచుకుంటూ మది
పాడుకునే పావననామం
నీకు పవళింపు సేవే కదా తండ్రీ ...

మేలుకొలుపులో
నిన్నే ఆరాధిస్తూ శ్వాసిస్తూ
హృదయం ఆలపించే గీతం
నీకు సుప్రభాతమే కదా తండ్రీ ...

ఇవన్నీ
నీవు సమకూర్చిన సుఖాలే తండ్రీ
నీవిచ్చిన ఈ సౌఖ్యాలను
నీకు సమర్పించడానికి కూడా ...

" సవా లక్ష సందేహాలు ఎందుకో "

ఓం శివోహం  సర్వం శివమయం.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...